News


ఎంఎస్‌సీఐ సూచీలో కీలక మార్పులు

Friday 8th November 2019
news_main1573188993.png-29442

ఈనెల 26 నుంచి అమలు
ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) సూచీ అర్ధవార్షిక పునఃసమీక్ష జరిగింది. ఈ సమీక్షలో భాగంగా ఎంఎస్‌సీఐ ఇండియా సూచీతో పాటు మరికొన్ని సూచీలకి కొత్తగా కొన్ని షేర్లను కలపడం, ఉన్నవాటిలో కొన్నింటిని తీసివేయడం జరిగింది. ఈ మార్పులు నవంబర్‌ 26 నుంచి అమల్లోకి వస్తాయి(ఆరోజు మార్కెట్‌ ట్రేడింగ్‌ అనంతరం). తాజా సమీక్షలో 78 దేశీయ స్టాకులు మార్పులకు గురయ్యాయి. 
భారతీయ షేర్లకు జరిగిన తాజా మార్పులు ఇలా ఉన్నాయి...
= ఎంఎస్‌సీఐ ఇండియా డొమస్టిక్‌ సూచీలో కొత్తగా ఎనిమిదింటిని చేర్చి ఉన్నవాటిలో ఆరింటిని తొలగించారు. 
చేరికలు: బెర్గర్‌ పెయింట్స్‌, డీఎల్‌ఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రు, ఇంద్రప్రస్థగ్యాస్‌, ఇన్ఫోఎడ్జ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, సీమెన్స్‌ ఇండియా.
తీసివేతలు: భెల్‌, గ్లెన్‌మార్క్‌, ఐబీ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, వొడాఫోన్‌ ఐడియా, యస్‌బ్యాంక్‌.

= ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ స్టాండర్డ్‌ ఇండెక్స్‌లో ఏడింటిని కొత్తగా చేర్చారు, ఉన్నవాటిలో నాలిగింటిని తొలగించారు.

= ఎంఎస్‌సీఐ వరల్డ్‌ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో కొత్తగా 13 స్టాకులను చేర్చి గతంలో ఉన్నవాటి నుంచి 21 స్టాకులను తొలగించారు.

= ఎంఎస్‌సీఐ ఇండియా స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో కొత్తగా17 షేర్లను చేర్చి, 33 షేర్లను తొలగించారు.

= ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ సూచీలో ఎస్‌బీఐ లైఫ్‌ను చేర్చారు.

= ఆసియా ఐఎంఐ సూచీ(జపాన్‌ మినహా)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెయిటేజ్‌ను 0.04 శాతం మేర తగ్గించారు. 



You may be interested

ఎంఎస్‌సీఐలో డీఎల్‌ఎఫ్‌..షేరు 6% అప్‌

Friday 8th November 2019

మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) దేశీయ ఇండెక్స్‌కి సంబంధించి డీఎల్‌ఎఫ్‌ను తన పోర్టుఫోలియోకి జోడించింది. ఫలితంగా ఈ షేరు శుక్రవారం సెషన్‌లో 6 శాతం లాభపడి ట్రేడవుతోంది. అంతేకాకుండా కంపెనీ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 19 శాతం వృద్ధి చెందింది. ఈ అంశాలతో పాటు నిలిచిపోయిన ఇళ్ల ప్రోజెక్టులను పూర్తిచేసేందుకు, కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సహకారంతో రూ. 25,000 కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి

కొత్త ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Friday 8th November 2019

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు శుక్రవారం కొత్త గరిష్టానికి చేరుకుంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.480.00లు వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే  ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 2.55శాతం వరకు పెరిగి రూ.490.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.9:50లకు షేరు క్రితం ముగింపు(రూ.478.70)తో పోలిస్తే 2.57 శాతం లాభంతో

Most from this category