News


గ్లోబల్‌ మార్కెట్ల డౌన్‌గ్రేడ్‌

Monday 8th July 2019
news_main1562578463.png-26899

రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ
అంతర్జాతీయ మందగమన భయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సం‍స్థ మోర్గాన్‌స్టాన్లీ, ప్రపంచ మార్కెట్లను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇప్పటివరకు కొనసాగిస్తున్న ఈక‍్వల్‌వెయిట్‌ రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రపంచ మార్కెట్లలో అప్‌సైడ్‌ కదలికలు పరిమితంగా ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది కాలంలో ఎస్‌అండ్‌పీ 500, ఎంఎస్‌సీఐ యూరప్‌, ఎంఎస్‌సీఐ ఈఎం, తోపిక్స్‌ జపాన్‌ తదితర సూచీల్లో కేవలం ఒక్క శాతం అప్‌మూవ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచ మందగమన భయాల నేపథ్యంలో ఎకనమిస్టులు ఫెడ్‌ వడ్డీరేట్లు తగ్గించాలని, ఈసీబీ మరో దఫా ఉద్దీపనలు ప్రకటించాలని సూచిస్తున్నారు. అయితే ఇందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. గత 30 ఏళ్ల చరిత్ర చూస్తే ఎకానమీలో మందగమన సమయంలో ఉద్దీపనలు, రేట్ల తగ్గింపు పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదని, గణాంకాలు మెరుగుపడుతున్న తరుణంలోనే ఇలాంటివి ప్రయోజనకారులుగా ఉంటాయని పేర్కొంది.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం, పీఎంఐ డేటా పేలవంగా మారాయి. ప్రపంచ ద్రవ్యోల్బణ అంచనాలు, కమోడిటీల ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌ తదితరాలన్నీ పరిమిత రికవరీనే చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాలను కూడా మోర్గాన్‌స్టాన్లీ డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఎర్నింగ్స్‌ పరంగా ఇంకా మార్కెట్లు కంపెనీల గైడెన్స్‌ తిరోగమించడాన్ని ప్రైస్‌ఇన్‌ చేయలేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంకేతాలన్నీ ఈక్విటీలకు రిస్కుగానే ఉన్నాయని తెలిపింది. లిక్విడిటీ సమస్య కొనసాగేందుకే ఎక్కువ ఛాన్సులున్నాయని పేర్కొంది. ఫెడ్‌, ఈసీబీలు చురుగ్గా వ్యవహరించే అవకాశాలున్నాయని తెలిపింది. You may be interested

పోస్ట్‌బడ్జెట్‌ సిఫార్సులు!

Monday 8th July 2019

కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అనంతరం పాజిటివ్‌గా ప్రభావితమయ్యే 21 షేర్లను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు. సామ్‌కో సెక్యూరిటీస్‌: 1. కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌, అదానీ పోర్ట్స్‌: అంతర్గత జలరవాణాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇందులో భాగంగా కార్గొ టెర్మినల్స్‌ సంఖ్యను పెంచనుంది. ఇవన్నీ జలరవాణా విభాగ రంగానికి చెందిన కంపెనీలకు మేలు చేసే అంశాలు. ఈ రెండు కంపెనీలకు కొత్త నౌకలు, పడవలు నిర్మించే ఆర్డర్లు పెరుగుతాయి. దీంతో పాటు

పతనానికి ఐదు కారణాలు

Monday 8th July 2019

 పలు ప్రతికూలాంశాల నడుమ సోమవారం మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్‌ 600 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల మేర నష్టపోయాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలు, అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు జూన్‌ నెలలో పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ప్రస్తుత పరిస్థితులలో అమెరికా ఫెడ్‌ వడ్డిరేట్ల తగ్గింపు ఉండదనే భయాలతో ఆసియా మార్కెట్లు 2 శాతం మేర పతనంకావడం ఇక్కడి మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి

Most from this category