STOCKS

News


కరోనా ప్రభావాన్ని అతిగా ఊహించారు!

Wednesday 12th February 2020
news_main1581486874.png-31719

రే డాలియో అభిప్రాయం
ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎక్కువ చేసి చూపారని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌ రే డాలియో అభిప్రాయపడ్డారు. ఈ భయాలు ఎక్కువ కాలం నిలిచేవి కావన్నారు. ఏదైనా అంటువ్యాధి ప్రబలినప్పుడు అందరిలో తలెత్తే సాధారణ భయాలే మార్కెట్‌ ఇన్వెస్టర్లలో కూడా కలిగాయని, కాకపోతే మార్కెట్లు ఈ భయాన్ని కాస్త ఎక్కువగా స్వీకరించాయని చెప్పారు. ఇకపై సూచీల్లో రీబౌండ్‌ ఉంటుందని అంచనా వేశారు. బ్రిడ్జ్‌వాటర్‌ అసోసియేట్స్‌కు వ్యవస్థాపకుడైన రేడాలియో అబుదాబిలోని ఒక సదస్సులో ఈ విషయాలను ప్రస్తావించారు. ఒకటిరెండేళ్లలో ఈ విషయాన్ని అంతా మర్చిపోతారన్నారు. ప్రపంచ హెడ్జ్‌ ఫండ్స్‌లో బ్రిడ్జ్‌వాటర్‌ అత్యుత్తమ రాబడులు అందిస్తోంది. 1975 నుంచి ఇంతవరకు ఈ ఫండ్‌ దాదాపు 5850 కోట్ల డాలర్ల లాభాల పంట పండించింది. గతేడాది మాత్రం ఫండ్‌ ప్రదర్శన బాగాలేదు. కొన్ని రోజుల క్రితం చైనాలోని ఊహాన్‌లో కరోనా వైరస్‌ పెల్లుబికింది. ఇది క్రమంగా ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారింది. దీని వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి. ఇప్పటివరకు దాదాపు వెయ్యిమంది దీని బారిన పడి మరణించారు. తొలుత ఈ వైరస్‌ భయాలతో బాగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. యూఎస్‌ సూచీలైతే పతనం అనంతరం తిరగి పరుగు ఆరంభించి ఆల్‌టైమ్‌ హైని చేరాయి. ఇలాంటి విషయాల కన్నా ఇన్వెస్టర్లు వెల్త్‌, రాజకీయ అంశాలు, చైనా పురోగతి, పోటీ తత్వం, టెక్నాలజీ, పర్యావరణం తదితర అంశాలపై ఫోకస్‌ పెంచుకోవాలని డాలియో సూచించారు. సమాజంలో రాజకీయ, సంపద అంతరం పెరిగిపోవడమే తనకు అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఆయన చెప్పారు. You may be interested

స్పార్క్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Wednesday 12th February 2020

కేన్సర్‌ ఔషధానికి నో షేరు 8 శాతం పతనం కేన్సర్‌ ఔషధం టేక్లంటిస్‌కు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించినట్లు వెలువడిన వార్తలు హెల్త్‌కేర్‌ రంగ సంస్థ సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కంపెనీ(స్పార్క్‌) కౌంటర్‌ను దెబ్బతీశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ పతన బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11.15 ప్రాంతంలో దాదాపు 8 శాతం దిగజారి రూ. 177 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 171

ఐపీఓకు ఎన్‌సీడీఈఎక్స్‌

Wednesday 12th February 2020

రూ.500 కోట్ల నిధుల సమీకరణ సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ ఇండియాలో అతిపెద్ద అగ్రి డెరివేటివ్స్‌ ఎక్చ్సేంజ్‌  నేషనల్‌ కమోడిటీ డెరివేటివ్స్‌ ఎక్చ్సేంజ్‌ ఐపీఓకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఐపీఓ మొత్తం రూ.500 కోట్లను సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా ఎగ్జిస్టింగ్‌​ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించడంతో పాటు రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించిన నిధులను

Most from this category