News


అంతర్జాతీయ అస్థిరత కొనసాగుతుంది!

Monday 15th October 2018
news_main1539591405.png-21165

ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌
వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ నాయకులు సిద్ధంగా ఉండాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడకులు, కేంద్రబ్యాంకుల నుంచి రేట్ల పెంపుదలలు కొనసాగుతాయని ఆమె అంచనా వేశారు. రాబోయే రిస్కులను తట్టుకునేలా తగిన మానిటరీ, ఫిస్కల్‌ ప్రణాళికలను రూపొందించుకొని ఉండాలని కేంద్ర బ్యాంకులకు ఆమె సూచించారు. సంస్కరణలు క్రమంగా మందగిస్తున్నాయని, అందువల్ల అంతా బాగుందనుకునే వీల్లేదని ఆమె తెలిపారు. వాణిజ్యయుద్ధం కొనసాగుతుండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్‌ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చలను పునరుద్ధరించాలని, సంస్కరణలను కొనసాగించాలని ఆమె అన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు. ట్రేడ్‌ రిస్కులు, మానిటరీ పాలసీలు కఠినతరం చేయడం అనే రెండు అంశాలపై బాలిలో జరిగిన సమావేశాల్లో చర్చలు జరిపామని ఆమె చెప్పారు. ఈ రెండు భయాలతో అటు యూఎస్‌ నుంచి ఇటు ఆసియా వరకు మార్కెట్లు అల్లకల్లోలమవుతున్న సంగతి తెలిసిందే. వాణిజ్య చర్చలు పునరుద్ధరించాలని జపాన్‌ అధికారులతో సహా పలువురు తాజా సమావేశాల్లో యూఎస్‌, చైనాలను కోరారు. మరోవైపు ఫెడ్‌ ఏకపక్ష రేట్ల పెంపు తమపై నెగిటివ్‌ ప్రభావం పెంచుతోందని వర్దమాన దేశాల ప్రతినిధులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే బ్యాంకింగ్‌ రంగం బలంగా ఉందని, ఎన్‌పీఏలు తగ్గాయని, పర్యవేక్షణ పెరిగిందని లగార్డ్‌ చెప్పారు. అయితే వ్యవస్థలో ఇంకా కొన్ని రిస్కులున్నాయని, వీటిని పరిష్కరించేలా ప్రణాళికలుండాలని ఆమె అభిప్రాయపడ్డారు. You may be interested

సెక్టోరల్‌ ఫండ్స్‌ వద్దు.. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ముద్దు..

Monday 15th October 2018

సెక్టోరల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు మ్యూచువల్‌ ఫండ్‌ నిపుణులు, వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. రూపాయి పతనం నేపథ్యంలో ఎగుమతి ఆధారిత వ్యాపారాలపై ఎక్కువగా ఆధారపడ్డ ఐటీ, ఫార్మా రంగ స్టాక్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. చాలా మంది అడ్వైజర్లు కూడా వారి ఇన్వెస్టర్లకు ఈ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే ధీరేంద్ర కుమార్‌ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇన్వెస్టర్లు

10500ల ఎగువకు నిఫ్టీ

Monday 15th October 2018

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లోకి మళ్లింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లతో పాటు హెవీ వెయిటేజ్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ ఇందుకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ గతంలో కోల్పోయిన కీలక సాంకేతిక స్థాయిలను తిరిగి అందుకున్నాయి. 35వేల మార్కును, నిఫ్టీ 10500 స్థాయిని తిరిగి అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలను అందుకున్న సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను

Most from this category