News


పాక్‌లో కేజీ టమోటా@ రూ. 400

Thursday 21st November 2019
news_main1574312702.png-29752

పాకిస్తాన్‌ పెద్ద నగరమైన కరాచిలో టమోటా ధరలు బుధవారం ఆకాశాన్ని తాకాయి. కేజీ టమోటా ధర రూ. 400 కు చేరుకుంది. వర్షాలు అధికంగా కురవడంతో టమోటా దిగుబడి తగ్గిందని, అంతే కాకుండా ప్రభుత్వం దిగుమతులపై నియంత్రణలు విధించడంతో డిమాండ్‌కి తగ్గ సరఫరా జరగడం లేదని డాన్‌ న్యూస్‌ పేర్కొంది. గత వారం పాకిస్తాన్‌ ప్రభుత్వం, ఇరాన్‌ నుంచి 4,500 టన్నుల టమోటాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం 989 టన్నులు మాత్రమే పాకిస్తాన్‌కి చేరుకున్నాయని ఓ ట్రేడర్‌ తెలిపారు. గత వారం కేజీ రూ. 300 గా ఉన్న టమోటా ధరలు, బుధవారం నాటికి రూ. 400కు పెరిగాయి. ఈ ఏడాది టమోటా దిగుబడి తగ్గడంతో కూడా టమోటా ధరలు భారీగా పెరిగాయని ట్రేడర్లు తెలిపారు. కాగా ఈ నెల ప్రారంభంలో టమోటా అధికారిక రిటైల్‌ ధర కేజి రూ. 117 గా ఉంది. ప్రభుత్వం దిగమతులపై నియంత్రణలను విధించడంతో ధరలు పెరిగాయని ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు నిందిస్తున్నారు. గతంలో ఒపెన్‌ దిగుమతులు టమోటా ధరలను స్థిరపరిచేవి అని ఫలాహి అంజుమన్‌ హోల్‌సేల్‌ వెజిటేబుల్‌ మార్కెట్‌ ప్రెసిడెంట్‌ హాజి షాహ్జహన్‌ అన్నారు. You may be interested

వాటా విక్రయ వార్తలతో జీ మీడియా 15శాతం జం‍ప్‌

Thursday 21st November 2019

ముంబై:- ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 15శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.337.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 15శాతం పెరిగి రూ.353.20 పెరిగి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.324.10)తో పోలిస్తే 7శాతం లాభంతో రూ.328.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట,

మీ ఫోన్‌ బిల్లు ఎంత పెరుగుతుందో తెలుసా?

Thursday 21st November 2019

రాబోయే రోజుల్లో వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు టారిఫ్‌ల పెంపుదలో జియో చూపే బాటలో నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో 15 శాతం మేర టారిఫ్‌లు పెంచితే ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ కనీసం 30 శాతం వరకు టారిఫ్‌లు పెంచుకోవచ్చని భావిస్తున్నారు. గతంలో జియో 15శాతం మేర టారిఫ్‌లు పెంచింది, ఈ దఫా కూడా అంతమేర పెరుగుదల ఉండొచ్చని నిపుణుల అంచనా. రుణభారాలతో కుంగిపోతున్న టెలికం కంపెనీలకు ఈ

Most from this category