News


రేట్‌ కట్‌ దిశగా ఫెడ్‌!

Wednesday 5th June 2019
news_main1559731670.png-26117

సంకేతాలిచ్చిన జెరోమ్‌ పావెల్‌
భారీగా లాభపడ్డ యూఎస్‌ మార్కెట్‌
ఆర్థిక మందగమన భయాలు యూఎస్‌ ఫెడ్‌ను వడ్డీరేట్ల తగ్గింపు దిశగా అడుగులు వేయిస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎకానమీలో అవసరపడితే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్‌ చైర్మన్‌ జోరోమ్‌ పావెల్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌, చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ముదిరిపోతున్న నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ట్రేడ్‌వార్‌ అంశాలు ఎప్పుడు, ఎలా పరిష్కారమవుతాయో తనకు తెలీదని చెప్పారు. అన్ని పరిస్థితులను యూఎస్‌ ఎకానమీ కోణంలో పరిశీలిస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఫెడ్‌ చైర్మన్‌ వ్యాఖ్యలను వైస్‌ చైర్మన్‌ రిచర్డ్‌ క్లారిడా సైతం సమర్థించారు. ధరల స్థిరత్వం, ఉపాధి కల్పన లక్ష్యాలుగా తమ విధానాలుంటాయని రిచర్డ్‌ చెప్పారు. బాండ్‌ ఈల్డ్స్‌లో ఇన్వర్టెడ్‌ కర్వ్‌ ఏర్పడడం మందగమనానికి సంకేతమన్న ఊహలపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించలేమన్నారు. కానీ ఇదే స్థితి కొనసాగితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పావెల్‌ వ్యాఖ్యలతో అమెరికా మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. బాండ్‌ఈల్డ్స్‌ పతనమయ్యాయి. బుధవారం ఆసియా షేర్లు సైతం ర్యాలీ జరిపాయి. 
ట్రేడ్‌వార్‌ కారణం
మెక్సికోపై తాజాగా ట్రంప్‌ విధించిన ఆంక్షలు ట్రేడ్‌వార్‌ భయాలను మరింత పెంచాయి. దీంతో పావెల్‌కు రేట్లు తగ్గించక తప్పని పరిస్థితి వచ్చిందని అనలిస్టుల అంచనా. చాలామంది నిపుణులు ఈ ఏడాదే రేట్‌కట్‌ ఆరంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. పావెల్‌ ప్రస్తుతం సంధి దశలోఉన్నారని, బలమైన వృద్ధి నమోదవుతున్నా, అవసరమైతే రేట్లను తగ్గించేందుకు వెనకాడరని చికాగోకు చెందిన ప్రముఖ అనలిస్టు డైన్‌ స్వోంక్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది కనీసం 0.5 పర్సెంటేజ్‌ పాయింట్‌ మేర రేట్లను పెడ్‌ తగ్గిస్తుందని ఎక్కువమంది ఆశిస్తున్నారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఫెడ్‌పై రేట్ల తగ్గింపు కోసం ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ట్రంప్‌ ఇష్టాఇష్టాలపై కాకుండా ఎకానమీలో అవసరాన్ని బట్టి వ్యవహరించాలని పావెల్‌ భావిస్తున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం వస్తే రేట్లు తక్కువగా ఉంటే మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకుల వద్ద ఆయుధాలు లేకుండా పోతాయి. అందువల్లే ఫెడ్‌ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సింది. తదుపరి ఫెడ్‌ మీటింగ్‌ జూన్‌ 18-19న జరగనుంది. You may be interested

ఇండియా వృద్ధిరేటు అంచనాలు యథాతధం!

Wednesday 5th June 2019

7.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ‍ప్రకటించిన ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీ వృద్ధిరేటు వచ్చే మూడేళ్ల పాటు 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేట్‌ వినిమయంలో జోరు కారణంగా ఎకానమీలో వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.2 శాతం ఉంటుందని అంచనా వేశామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. కానీ భారత జీడీపీ గత సంవత్సరం 6.8 శాతం వృద్ధినే నమోదు చేసింది.

రేటు తగ్గింపు ఖాయం!

Wednesday 5th June 2019

రేటు తగ్గింపు ఖాయం! ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరగనుంది.  గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో జరగనున్న పరపతి కమిటీ సమావేశం రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6 శాతం) 35 బేసిస్‌ పాయింట్లవరకూ తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. శక్తికాంతాస్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే

Most from this category