News


ఇండియా సైతం తప్పించుకోలేదు!

Saturday 29th February 2020
news_main1582956270.png-32182

కరోనా కరెక‌్షన్‌ ప్రభావం తప్పదు
పెట్టుబడిసాధనాలన్నీ దుర్బలంగా ఉన్నాయి
మార్క్‌ ఫెబర్‌ హెచ్చరికలు
భారత్‌ సహా అన్ని మార్కెట్లు చాలా ఖరీదైనవిగా ఉన్నాయని ప్రముఖ అనలిస్టు మార్క్‌ ఫెబర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా పతనం వస్తోందని, ఈ వరుసలో ఇండియా సైతం కరెక‌్షన్‌ తప్పించుకోలేదని తెలిపారు. కరోనా వైరస్‌ అనేది ఈ పతనానికి ఒక ఉత్ప్రేరకమేనన్నారు. ప్రస్తుతం ప్రపంచ బుల్‌మార్కెట్‌ 11వ సంవత్సరంలో ఉందన్నారు. 2009 మార్చి6న అంతర్జాతీయ బుల్‌మార్కెట్‌ ఆరంభమైందన్నారు. అన్ని మార్కెట్లలో బ్లూచిప్స్‌, గ్రోత్‌స్టాక్స్‌ అన్నీ వాల్యూషన్ల పరంగా బాగా ఖరీదుగా మారాయాని చెప్పారు. ప్రపంచ ఎకానమీలో ప్రపంచ స్టాక్‌మార్కెట్‌ క్యాప్‌ వాటా గరిష్ఠాలకు చేరిందన్నారు. ఫిబ్రవరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లన్నీ ఓవర్‌బాట్‌గా, ఖరీదైనవిగా మారాయని, 2019లో ఆరంభమైన మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదని తెలిపారు. చాలా దేశాల్లో మాంద్యం ఆరంభమైన సంకేతాలు ఉన్నాయన్నారు. కానీ ప్రముఖ మీడియా గ్రూపులు చెప్పే కాకమ్మ కబుర్లు విని ఇన్వెస్టర్లు ర్యాలీ కొనసాగుతుందన్న భ్రమలతో ఇంకా స్టాకులు కొంటూనే ఉన్నారన్నారు. ఒక్కమారుగా వీరందరినీ మార్కెట్‌ విపత్కర పరిస్థితుల్లోకి నెట్టిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు భయపడకుండా రీబౌండ్‌ కోసం వేచిచూసి బయటపడాలని సూచించారు. తొందరపడి పోర్టుఫోలియోలో ఉన్నవన్నీ అమ్ముకోవద్దని, లాభాలు ఎక్కువగా ఉన్నవాటిలో ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవాలని చెప్పారు. 
క్రూడాయిల్‌ధరలు మరింత పతనమైతే ఇండియాకు కలిసివస్తుందన్నారు. కానీ ఇండియా స్టాక్‌మార్కెట్లు, బ్లూచిప్స్‌ భారీ వాల్యూషన్లతో ఉన్నాయన్నారు. అందువల్ల మార్కెట్‌లో డౌన్‌సైడ్‌ రిస్కు ఎక్కువన్నారు. కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు కుప్పకూలుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియా సైతం ఇతర మార్కెట్లలాగానే దుర్బలంగానే ఉందని చెప్పారు. విలువైన లోహాల్లో ప్లాటినంపై తాను గతంలో పాజిటివ్‌గా ఉన్నానని, అందుకుతగ్గట్లే అది మంచి ప్రదర్శన చూపుతూ వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు ఇది కూడా బలహీనంగా ఉందన్నారు. ఈ సమయంలో తాను కొంత వేచిచూసే ధోరణి అవలంబిస్తానన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని పెట్టుబడిసాధనాలు(షేర్లు, బంగారం, రియల్టీ, విలువైన లోహాలు, బాండ్స్‌) దుర్బలంగా ఉన్నాయన్నారు. అందువల్ల ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. You may be interested

పావెల్‌ వ్యాఖ్యలతో యూఎస్‌ సూచీల పతనానికి బ్రేక్‌!

Saturday 29th February 2020

వరుసగా ఏడోరోజూ నష్టాల్లో ముగిసిన ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌  2008 తర్వాత ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నాస్‌డాక్‌, డౌజోన్స్‌ అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చనే భయాలతో ఈ దేశ స్టాక్‌ సూచీలు శుక్రవారం నష్టంతో ముగిశాయి. సూచీలకు ఇది వరుసగా ఏడో రోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇలాగే కొనసాగితే ఈసారి వడ్డీరేట్ల

ఏజీఆర్‌పై టెల్కోలకు నిరాశ..

Saturday 29th February 2020

డీసీసీ భేటీలో నిర్ణయం వాయిదా న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరటనిచ్చే చర్యలపై చర్చించేందుకు శుక్రవారం జరిగిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ (డీసీసీ) సమావేశం.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఏజీఆర్ డేటాను మదింపు చేసేందుకు మరిన్ని వివరాలు అవసరం కావడంతో డీసీసీ కొద్ది రోజుల్లో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు భేటీ సాగినట్లు వివరించాయి. మరోవైపు,

Most from this category