News


ఇండియా మార్కెట్టే బెటర్‌!

Wednesday 14th August 2019
news_main1565772456.png-27764

వర్ధమాన మార్కెట్ల కన్నా మంచి ప్రదర్శన
ఈపీఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ కామెరాన్‌ బ్రాండ్‌
వాణిజ్యయుద్ధ వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ఈ ఏడాది ఇండియా సహా ఏ ఇతర వర్ధమాన మార్కెట్‌లోకి కూడా భారీ విదేశీ నిధులు రాకపోవచ్చని ఈపీఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ కామెరాన్‌ బ్రాండ్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఆసియాలోని ఇతర వర్ధమాన దేశాల మార్కెట్ల కన్నా భారత్‌ మంచి ప్రదర్శన చూపుతుందన్నారు. భారత సంస్కరణల ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో కనిపించాల్సిఉందన్నారు. దీర్ఘకాలానికి భారతే బెటరని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి భారత మార్కెట్‌ను విదేశీ మదుపరులు రక్షణాత్మకంగా వాడుకోవచ్చన్నారు. ఎందుకంటే, భారత్‌ ఇతర ఆసియా దేశాల్లాగా అధికంగా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రభావితం కాదన్నారు. అందువల్ల ట్రేడ్‌వార్‌ ప్రభావం ఇండియాపై ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్పారు. చైనా కేంద్రబ్యాంకు తన కరెన్సీ న్యూనీకరణ చేసిన తర్వాత వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ నిధులు బయటకు పోవడం చూడవచ్చన్నారు. గతవారం ఇందుకు తగ్గట్లే వర్ధమాన మార్కెట్ల నుంచి బయటకు వెళ్లిన విదేశీ నిధుల సరాసరి ఒక్కమారుగా 70 కోట్ల డాలర్ల నుంచి 500 కోట్ల డాలర్లకు పెరిగిందని చెప్పారు. ఈ వారం మరో 400 కోట్ల డాలర్ల నిధుల ఉపసంహరణ ఉంటుందని అంచనా వేశారు. ఇండియా సైతం ఈ ధోరణిని చూసిందని, దీనికితోడు సూపర్‌రిచ్‌ టాక్స్‌ విధింపు ఇండియా నుంచి విదేశీ నిధుల ఉపసంహరణను పెంచిందని తెలిపారు. జూలైలో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌లో దాదాపు 15వేల కోట్ల రూపాయల విక్రయాలు జరిపారు. 
ట్రేడ్‌వార్‌ ఇప్పుడే ముగిసిపోదు..
యూఎస్‌- చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్యయుద్ధం ఈఏడాదిలో ముగింపునకు రాదని కామెరాన్‌ అభిప్రాయపడ్డారు. ఒకసారి ఈ ట్రేడ్‌వార్‌ ఆరంభించాక ముగించడం చాల కష్టమన్నారు. ఇది ముదిరేకొద్దీ ఎదురయ్యే ట్రేడ్‌ ఇబ్బందులు రాజకీయవాదులకు సొంత దేశంలో కొత్త అవకాశాలు కల్పిస్తాయని, దీనికితోడు ఈ ఇబ్బందులు తీరకుండా సొంతదేశంలో లాబీ గట్టి యత్నాలు చేస్తుంటుందని విశ్లేషించారు. యూరప్‌లో కూడా త్వరలో అతిపెద్ద వాణిజ్య ఇబ్బందులు రావచ్చని అంచనా వేశారు. యూకే, జర్మనీ, ఇటలీల్లో పరిస్థితులు దిగజారుతున్నాయన్నారు. రాబోయే ఏడాది ఎన్నికల కారణంగా ట్రంప్‌ వాణిజ్యయుద్ధంపై వెనకడుగు వేయకపోవచ్చని తెలిపారు. ట్రేడ్‌వార్‌ సమసిపోతుందని ద్వితీయ త్రైమాసిక ఆరంభంలో ఆశలు చిగురించాయని, కానీ ప్రస్తుతం అవన్నీ అడుగంటాయని, ఇప్పుడు పరిస్థితి నిరాశాపూరితంగా ఉందని తెలిపారు. 



You may be interested

11000 పైన ముగిసిన నిఫ్టీ

Wednesday 14th August 2019

353 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సానుకూలాంశాలు కిత్రం ట్రేడింగ్‌ భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్‌ బుధవారం కొంతవరకూ ఆ నష్టాల్ని పూడ్చుకోగలిగింది.  సెన్సెక్స్‌ 353 పాయింట్లు లాభంతో 37,311.53 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 11,029.40 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలకు తోడు షార్ట్‌ కవరింగ్‌, రూపాయి షార్ప్‌ రికవరీ తదితర అంశాలు సూచీలు లాభాలకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో

పతనం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ రికవరీ

Wednesday 14th August 2019

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ షేర్లు బుధవారం 7.50శాతం పతనం నుంచి రివకరి అయ్యాయి. స్టాండర్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ వాటాను విక్రయించడంతో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 7.50శాతం క్షీణించాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.489.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీకి చెందిన ప్రతి షేరు ధర రూ.486 చొప్పున 3.2శాతానికి సమానమైన 6.4 కోట్ల ఈక్విటీ షేర్లు బ్లాక్‌డీల్‌ ద్వారా చేతులు

Most from this category