News


ఇండియా కన్నా చైనా షేర్లపైనే హెచ్‌ఎస్‌బీసీ మక్కువ

Thursday 11th July 2019
news_main1562834103.png-26986

 ఇప్పటివరకు భారత కంపెనీల షేర్లపై పాజిటివ్‌గా ఉ‍న్న అంతర్జాతీయ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ తాజాగా చైనా షేర్లపై మక్కువ ప్రకటిస్తోంది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్న నేపథ్యంలో భారత్‌ కన్నా చైనా షేర్లు బెటరని తెలిపింది. దశాబ్ద కాలంలో తొలిసారి వడ్డీరేట్ల తగ్గింపునకు సంబంధించి ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ బుధవారం సానుకూలంగా స్పందించారు. నిజానికి గత మేలో హెచ్‌ఎస్‌బీసీ సంస్థ చైనా షేర్‌మార్కెట్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. వాణిజ్యయుద్ధ భయాలతో సంస్థ ఈ నిర్ణయం ప్రకటించింది. కానీ తాజాగా ఫెడ్‌ రేట్‌ కట్‌ ఆశలు పెరగడంతో బిజినెస్‌ సైకిల్స్‌కు అనుగుణంగా కదలాడే చైనా మార్కెట్‌పై పాజిటివ్‌గా మారినట్లు తెలిపింది. 

రాబోయే రోజుల్లో ఫెడ్‌ రేట్‌ కట్‌ నేపథ్యంలో మరీ అంత రక్షణాత్మకంగా ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి హెరాల్డ్‌ వాండర్‌ లిండే చెప్పారు. అందుకే చైనా రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి ఓవర్‌ వెయిట్‌కు మారుస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఇండియా రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు చెప్పారు. ఇండియా మార్కెట్ల అధిక వాల్యూషన్లే డౌన్‌గ్రేడింగ్‌కు కారణమన్నారు. 

ట్రేడ్‌ టెన్షన్ల కారణంగా ఇండియా ఎర్నింగ్స్‌ బాగా దెబ్బతింటాయని లిండే అభిప్రాయపడ్డారు. చైనాతో పోలిస్తే ఇండియాలో ఎర్నింగ్స్‌పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల నెగిటివ్‌ ప్రభావం ఎక్కువని తెలిపారు. దీంతో పాటు ఎంఎస్‌సీఐ లాంటివి చైనా స్టాకులను తమ సూచీల్లో ఎక్కువగా చేర్చుకోవడం, ఈ నెల 22నుంచి నాస్‌డాక్‌ లాంటి నూతన స్టాక్‌మార్కెట్‌ను ఆరంభించడం లాంటివి చైనా స్టాక్స్‌కు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని తెలిపారు. ఈ ఏడాది చైనా మార్కెట్లు దాదాపు 17 శాతం లాభపడ్డాయి. మే, జూన్‌లో మాత్రం ట్రేడ్‌ ఉద్రిక్తతలు పెరగడంతో దాదాపు 7 శాతం పతనమయ్యాయి. 



You may be interested

ఇంకో పక్షం రోజులు మార్కెట్లు ఇంతే

Thursday 11th July 2019

పీఎస్‌బీ రంగం‍లో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బలంగా ఉన్నాయి ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ పరిశీలించవచ్చు ఆటో రంగం‍లో సిఫార్సు, కొనుగోలుకు విముఖతగా ఉన్నాను: సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌ బడ్జెట్‌ వెలువడిన తర్వాత మార్కెట్లు భారిగా దిద్దుబాటుకు గురయ్యాయని, మార్కెట్లు ముందుకు వెళ్లడానికి చాలా తక్కువ కారకాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఇంట్రాడే క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Thursday 11th July 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా గురువారం రియల్టీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌లో 277.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిది. వరసుగా మూడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన ఈ రంగ షేర్లలో నేడు షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. ఫలితంగా ఇంట్రాడే ఇండెక్స్‌ 1.50శాతం పెరిగి 279.70 స్థాయికి చేరుకుంది. ఇండెక్స్‌లో

Most from this category