News


ట్రంప్‌ అభిశంసనకు హౌస్‌ ఆమోదం

Thursday 19th December 2019
news_main1576729449.png-30303

వచ్చే నెల్లో సెనెట్‌లో చర్చ
దిగిపోయే అవకాశాలు తక్కువే..
అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా ఓటేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలపై ట్రంప్‌ను సభ అభిశంసించింది. హౌస్‌ ఆమోదం అనంతరం ఈ తీర్మానం సెనెట్‌లో చర్చకు రానుంది. సెనెట్‌లో కూడా తీర్మానం ఆమోదం పొందితే ట్రంప్ పదవి నుంచి వైదొలగాల్సిఉంటుంది. కానీ సెనెట్‌లో రిపబ్లికన్లకు ఉన్న మెజార్టీ దృష్ట్యా ట్రంప్‌ పదవికి తక్షణ ముప్పేమి ఉండదని రాజకీయ విశ్లేషకుల అంచనా. హౌస్‌లో డెమోక్రాట్లకు మెజార్టీ ఉంది. అందుకే 237 మంది తీర్మానానికి ఆమోదం తెలపగా, 197 మంది వ్యతిరేకించారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు అధ్యక్షులు అభిశంసనకు గురయ్యారు. ట్రంప్‌ కారణంగా అమెరికా మౌలిక ఆలోచనలే రిస్కులో పడ్డాయని అభిశంసన విచారణకు నేతృత్వం వహించిన ఆడమ్‌ షిఫ్‌ ఓటింగ్‌ సందర్భంగా విమర్శించారు.

ఉక్రైన్‌ అధ్యక్షుడిపై ఒత్తిడి తేవడం ద్వారా ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఒక విజిల్‌ బ్లోయర్‌ ఆరోపించడంతో ఈ దుమారం ఆరంభమైంది. హౌస్‌లో ఈ అంశంపై దాదాపు 10 గంటల చర్చ జరిగింది. ట్రంప్‌ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. ఇదంతా డెమోక్రాట్ల నాటకమని విమర్శిస్తూ వచ్చారు. ఈ తీర్మానంతో అమెరికాపై డెమోక్రాట్లు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఒకపక్క సభలో చర్చ జరుగుతుంటే మరోపక్క ట్రంప్‌ పలు ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన నేపథ్యంలో యూఎస్‌, ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. You may be interested

షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే

Thursday 19th December 2019

ముంబై: జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని నెస్లే ఇండియా వినియోగదారులకు వెంటనే బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను ఆర్జించిందంటూ లాభాపేక్ష నిరోధక విభాగం (ఎన్‌ఏఏ) జారీ చేసిన షోకాజు నోటీసును పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా ప్రయోజనం పొందినందుకు రూ.90 కోట్లు చెల్లించాలని ఎన్‌ఏఏ ఈ నెల 12న జారీ చేసిన షోకాజు నోటీసులో నెస్లే ఇండియాను ఆదేశించడం గమనార్హం. గ్రాముల్లో చేసిన

నోకియా 2.3 వచ్చేసింది

Thursday 19th December 2019

ధర రూ. 8,199 న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ హ్యండ్‌సెట్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌... బుధవారం భారత మార్కెట్లో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల్లోనే తొలుత ఈజిప్ట్‌ రాజధాని కైరోలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ 6.2 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ.

Most from this category