News


జూలైలో ఫెడ్‌ రేట్‌ కట్‌?!

Thursday 20th June 2019
news_main1561027213.png-26452

 గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా
యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు వచ్చే జూలై, సెప్టెంబర్‌లో వడ్డీరేట్లను తగ్గిస్తుందని గోల్డ్‌మన్‌సాక్స్‌ అనలిస్టులు తాజాగా అంచనాలు వేస్తున్నారు. నిజానికి గత అంచనాల్లో జూన్‌16నే ఫెడ్‌ రేట్‌ కట్‌ ఉంటుందని సంస్థ అభిప్రాయపడింది. అయితే తాజాగా తన అంచనాలను పునఃసమీక్షించుకుంది. ఫెడ్‌తో నేరుగా డీల్‌ చేసే 24 ప్రైమరీ డీలర్లలో గోల్డ్‌మన్‌ సాక్స్‌ ఒకటి. ఇతర నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరకు మూడు సార్లు రేట్ల తగ్గింపు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తన అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఫెడ్‌ చైర్మన్‌ను తొలగించే ఆలోచనలో అధ్యక్షుడు ట్రంప్‌ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పావెల్‌ను బోర్డు గవర్నర్‌గా డిమోట్‌ చేసేందుకు తన అధికారాలను ఉపయోగించాలని ట్రంప్‌ భావిస్తున్నారని, అయితే తక్షణమే ఈ చర్యకు ఉపక్రమించకపోవచ్చని తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయ్యేవరకు కొనసాగాలని భావిస్తున్నట్లు ఇటీవలే పావెల్‌ వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్‌ మాత్రం తద్భిన్నంగా భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో ఫెడ్‌ నిర్ణయాలపై ట్రంప్‌ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాతో ట్రేడ్‌ వార్‌ కొనసాగుతున్న సమయాన ఎకానమీ కుంగిపోకుండా ఉండేందుకు వడ్డీరేట్లు తగ్గించాలని ట్రంప్‌ పదేపదే కోరుతున్నారు. కానీ పావెల్‌మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. తాజా సమీక్షా సమావేశానంతరం కూడా ఫెడ్‌పై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఫెడ్‌ చైర్మన్‌గా వేరే వాళ్లు ఉండిఉంటే వడ్డీరేట్లు ఇంతగా పెరిగేవి కావని వ్యాఖ్యానించారు. దీంతో పావెల్‌పై ట్రంప్‌కున్న అసంతృప్తి మరోమారు బయటపడింది. ఫెడ్‌ చైర్మన్‌ను అభిశంసించడానికి ప్రత్యేక విధానం ఉంటుంది. సరైన కారణం చూపి మాత్రమే ఫెడ్‌ గవర్నర్లను తొలగించడం కుదురుతుంది. 



You may be interested

చిన్న వ్యాపారం.. తక్కువ అనుమతులు!

Thursday 20th June 2019

కిరాణా, తినుబండార షాపులు పెట్టుకోడానికి  తీసుకోవలసిన అనుమతులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకగవక్షా విధానాన్ని అమలు చేసి చిన్న వ్యాపారాలకు తొందరగా అనుమతులు లభించే విధంగా చర్యలు చేపట్టనుంది. సింగపూర్‌, చైనా వంటి దేశాలలో రెస్టారెంట్‌ ప్రారంభించడానికి కేవలం నాలుగు అనుమతులు తీసుకుంటే చాలు. కాగా ఇండియాలో ప్రస్తుతం రెస్టారెంట్‌కు ప్రారంభించడానికి 17, కిరాణా షాపును ప్రారంభించడానికి 28 అనుమతులు తీసుకోవలసి ఉంది. రెస్టారెంట్‌ను నిర్వహించేవాళ్లు ఫైర్‌, వాణిజ్య ప్రకటనలు

సెన్సెక్స్‌ లాభం 493 పాయింట్లు

Thursday 20th June 2019

140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు రాణించిన స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్‌ గురువారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 490 పాయింట్ల 39,601 స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 11,831 వద్ద ముగిసింది. నిన్న రాత్రి అమెరికా కీలకవడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడటంతో ప్రపంచమార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ నెల చివరిన జీ-20 సదస్సులో అమెరికా -

Most from this category