News


ఫెడ్‌ స్వరం మారింది!

Tuesday 25th June 2019
news_main1561458054.png-26565

న్యూట్రల్‌ రేట్‌ తగ్గించిన యూఎస్‌ కేంద్రబ్యాంకు
దీర్ఘకాలిక వడ్డీరేట్ల అంచనాలను యూఎస్‌ ఫెడరల్‌ తగ్గించింది. యూఎస్‌ ఎకానమీలో మందగమనం మరింత పెరగకుండా, వృద్ధి పరుగులు పెట్టాలంటే వడ్డీరేట్లు మరింతగా తగ్గించాలని ఫెడ్‌ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. న్యూట్రల్‌ రేటు(ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపని రేటు) 2.5 శాతం ఉండాలని తాజాగా ఫెడ్‌ నిర్ణయించింది. 2014లో న్యూట్రల్‌ రేటు 4 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చిలో న్యూట్రల్‌ రేటు 2.75 శాతముంది. న్యూట్రల్‌రేటును తగ్గించడమంటే ఇప్పుడున్న వడ్డీరేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు పెరిగినట్లు భావిస్తారు. ఎకానమీలో రిస్కులు తగ్గించేందుకు ఈ ఏడాది మరింతగా రేట్లు కట్‌ చేసే అవకాశాలు పెరిగాయని ఫెడ్‌ భావిస్తోంది. ఇది అనూహ్యం, చాలా కీలకమని ఎకనమిస్టులు వ్యాఖ్యానించారు. ఈ మార్పుతో జూలైలోనే ఫెడ్‌ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు మరింతగా పెరిగాయని డాయిష్‌ బ్యాంక్‌ పేర్కొంది. చాలా సంవత్సరాలుగా ఫెడ్‌ తన విధానం వృద్ధికి అనుకూలమని భావిస్తూ వచ్చిందని, తాజాగా తన మానిటరీ పాలసీ ఎకానమీలో ఏమాత్రం ఉత్తేజం కలిగించడంలేదని గ్రహించిందని నిపుణులు చెబుతున్నారు. ఉత్పాదక తగ్గడం, లేబర్‌ మార్కెట్లో నిరాశ, ట్రేడ్‌వార్‌ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభ సూచనలు.. లాంటివి ఫెడ్‌ ధృక్పథం మారేందుకు కారణాలయ్యాయి. మంగళవారం ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ విదేశీ వ్యవహారాల కౌన్సిల్‌ ముందు పాలసీ విధానాలపై ప్రసంగించనున్నారు. 
3 శాతం వృద్ది సాధ్యమా?
ఈ ఏడాది యూఎస్‌ ఎకానమీ 3 శాతం వృద్ది నమోదు చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆశిస్తున్నారు. ట్రంప్‌ ఆర్థిక సలహాదారులు ఈ లక్ష్యం సాధ్యమేనని చెబుతున్నారు. అయితే ఫెడ్‌ మాత్రం భిన్నంగా యోచిస్తోంది. యూఎస్‌ దీర్ఘకాలిక వృద్ధిరేటు 1.8- 2 శాతం మధ్య ఉండొచ్చని ఫెడ్‌ అంచనా వేస్తోంది. ఇతర ఎకనమిస్టులు కూడా ఇదే భావనలో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఇంతవరకు ఎలాంటి భారీ ముందడగు లేదని ఎకనమిస్టు బ్రాడ్‌ డీలాంగ్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో రేట్ల పెంపు ఆరంభించిన ఫెడ్‌ అతితక్కువ కాలంలోనే తన ధృక్పథాన్ని మార్చుకోవాల్సివచ్చింది. అక్టోబర్‌లో రేట్లు పెంచిన సందర్భంగా న్యూట్రల్‌ రేటు కన్నా చాలా తక్కువగా వడ్డీరేట్లున్నాయని, అందువల్ల మరిన్ని పెంపులు ఉంటాయని అప్పుడు ఫెడ్‌ వ్యాఖ్యానించింది. కానీ తొందర్లోనే ఎకానమీ నిజ పరిస్థితి ఫెడ్‌కు అర్దమైంది. యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఫెడ్‌ ధోరణిపై విమర్శలు గుప్పిస్తూవస్తున్నారు. అంత తొందరగా రేట్లు పెంచడం ఫెడ్‌ చేసిన తెలివితక్కువ పని అని ఆయన విమర్శించారు. తాజాగా రేట్‌కట్‌పై ఫెడ్‌ ధోరణి వేగంగా మారడాన్ని ఎకనమిస్టులు స్వాగతిస్తున్నారు. 

 You may be interested

సెన్సెక్స్‌ 312 పాయింట్లు అప్‌

Tuesday 25th June 2019

97 పాయింట్ల లాభపడిన నిఫ్టీ మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీగా లాభపడింది. మెటల్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 312 పాయింట్లు లాభపడి 39,435 వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 1,796.50 వద్ద స్థిరపడింది. ఫలితంగా సూచీల 2రోజుల నష్టాలకు నేడు బ్రేక్‌ పడినట్లైనంది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 245పాయింట్లు(0.80శాతం) లాభపడి

ఎస్‌బీఐ లైఫ్‌ 4.31 శాతం డౌన్‌

Tuesday 25th June 2019

బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ 2.5 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌  షేర్లను మార్కెట్‌ ధరకంటే డిస్కౌంట్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించడంతో మంగళవారం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ షేరు 4.31 శాతం నష్టపోయి రూ.680 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బీఐ లైప్‌ ఇన్సూరెన్స్‌లో బీఎన్‌పీ పారిబాకు 7.7 శాతం వాటా ఉండగా ఎస్‌బీఐకు 62.10 శాతం వాటా ఉంది. గత సెషన్‌ ధర కంటే 8.5

Most from this category