News


జనవరి 31 వరకూ బ్రెగ్జిట్‌ గడువు పొడిగింపు

Monday 28th October 2019
news_main1572260116.png-29185

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ గడువును మరోసారి పొడిగించారు. అందుకు ఈయూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈయూ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ టస్క్‌ ఓ ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ అభ్యర్థన మేరకు బ్రెగ్జిట్‌కు గతంలో విధించిన అక్టోబర్ 31 గడువును... 31 జనవరి 2020 వరకు పొడిగించేందుకు 27 ఈయూ సభ్యదేశాలు ఆంగీకారం తెలిపాయి.  వ్రాతపూర్వక విధానం ద్వారా నిర్ణయం లాంఛనప్రాయంగా జరిగిందని, ఈయూ నాయకులు వ్యక్తిగతంగా కలుసుకోవాల్సిన అవసరం లేదని టస్క్‌ తెలిపారు. బ్రెగ్జిట్‌ విషయంలో బ్రిటన్‌ సర్కారు ఈయూతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంపై చర్చకు కూడా పార్లమెంట్‌ నిరాకరించటంతో ప్రధాని జాన్సన్‌ గడువు పెంపుదల కోరుతూ ఐరోపా కూటమికి సంతకం లేని లేఖను పంపిన సంగతి తెలిసిందే. 



You may be interested

స్టాక్‌ మార్కెట్‌ అంటే.....కరీనాకు ఝుంఝున్‌వాలా టిప్స్‌

Monday 28th October 2019

ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝుంఝున్‌వాలా, బాలివుడ్‌ సినీనటి కరీనా కపూర్‌ మధ్య దీపావళి సందర్భంగా ఓ ఆంగ్ల చానెల్‌లో చిట్‌ చాట్‌ జరిగింది. రాకేష్‌ ఝుంఝున్‌వాలా, కరీనా కపూర్‌కు కొన్ని స్టాక్‌ మార్కెట్‌ టిప్స్‌ ఇచ్చారు. అందులో కొన్ని.. రాకేష్‌ ఝుంఝున్‌వాలా : స్టాక్‌ మార్కెట్‌ దేశానికి అవసరం. ఇతర రంగాలలో ఉన్నట్టుగానే మంచివాళ్లు, మోసగాళ్లు ఈ రంగంలో కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజలు తాము దాచుకున్న నగదును పెట్టవలసి వస్తుంది. దాచుకునే వారి

ఏడాది సమయంలో 50 శాతం లాభం కోసం...

Monday 28th October 2019

టాప్‌ టెన్‌ సిఫార్సులు వచ్చే సంవత్సరం సంవత్‌ 2077లోపు 15- 50 శాతం వరకు రాబడినిచ్చే సత్తా ఉన్న టాప్‌ టెన్‌ స్టాక్‌ రికమండేషన్లు ఇలా ఉన్నాయి...         1. ఐసీఐసీఐ బ్యాంక్‌:               టార్గెట్‌ రూ. 550. రాబోయే సంవత్సరాల్లో రుణ వృద్ధి 17 శాతం, ఆర్‌ఓఈ 1.5 శాతం, ఆర్‌ఓఈ 15.5 శాత మేర వార్షిక వృద్ధి సాధిస్తాయని అంచనా. 2. ఎల్‌అండ్‌టీ:                   టార్గెట్‌ రూ. 1900. రాబోయే రెండళ్లలో ఈపీఎస్‌లో 23 శాతం,

Most from this category