News


మరోసారి బ్రెగ్జిట్‌ గడువును పొడిగించిన ఈయూ

Saturday 26th October 2019
news_main1572075576.png-29165

బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) డెడ్‌లైన్‌ను ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మరోసారి పొడిగించింది. కానీ బ్రిటన్‌లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ పొడిగింపునకు ఎటువంటి తేదీని ప్రకటించలేదు. కాగా గత వారం ప్రధాని జాన్సన్‌ బోరిస్‌ బ్రెగ్జిట్‌ డీల్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లోకి వచ్చినప్పటికి, మెజార్టీ ఆమోదం పొందలేకపోయిన విషయం తెలిసిందే. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల అంబాసిడర్‌లు బ్రెగ్జిట్‌ ఒప్పందం గడువు పెంచడంపై శుక్రవారం సమావేశమై గడువు పొడిగించాలని నిర్ణయించారు. కాగా ఈ పొడిగింపు, జాన్సన్‌ ‘డూ ఆర్‌ డై’ తేది అక్టోబర్‌ 31కి వారం రోజులు ముందు రావడం గమనార్హం. ‘దీనిపై కార్యచరణ ఈ వారంతంలో కూడా కొనసాగుతుంది. బ్రస్సెల్‌లో సోమవారం లేదా మంగళవారం రాయబారులు మళ్లి సమావేశం కానున్నారు’ అని ఒక ఇయూ అధికారి వివరించారు.  
    మూడవ సారి బ్రెగ్జిట్‌ ఒప్పందం గడువు ఎంత వరకుండాలనే అంశంపై  ఈయూ దౌత్యవేత్తలు మంతనాలు చేస్తున్నారు. కానీ బ్రిటన్‌ పరిస్థితులు ఏవిధంగా మారుతాయో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. బ్రెగ్జిట్‌ గడువు పొడిగింపును నవంబర్‌ 15 లేదా నవంబర్‌ 30 వరకు ఆలస్యం చేసి, జాన్సన్‌ డీల్‌ను బ్రిటన్‌ పార్లమెంట్‌ అంగీకరించేలా లేదా బ్రిటన్‌ హర్డ్‌ ఎగ్జిట్‌ను ఎదుర్కొనేలా ఒత్తిడి తీసుకురావాలని, ప్రాన్స్‌ ఇతర 26 దేశాల దౌత్యవేత్తలపై ఒత్తిడి చేస్తున్నదని ఓ ఈయూ దౌత్యవేత్త తెలిపారు. ‘ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుండగా, ఫ్రాన్స్‌ మాత్రం సోమవారం లేదా మంగళవారం వరకు వేచి ఉండి, బ్రిటన్‌ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుంది’ అని అన్నారు. ‘ఫ్రాన్స్‌ ఒక అర్థవంతమైన ఒప్పంద పొడిగింపును కోరుకుంటుంది. ఈ పరిస్థితిపై స్పష్టత తీసుకురావడం బ్రిటన్‌ చేతిలో ఉందని, అంతేకాకుండా బ్రెగ్జిట్‌ పొడిగింపు ఉండదనే అంశాలను బ్రిటన్‌కు తెలిసేలా చేయాలనుకుంటున్నాం’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్‌ మాక్రన్‌ సన్నిహితుడు తెలిపారు.



You may be interested

ఆరంభలాభాలు ఆవిరి: అరడాలరు లాభంతో ముగిసిన పసిడి

Saturday 26th October 2019

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలం కావడంతో పసిడి ధర శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో కేవలం అరడాలరు స్వల్ప లాభంతో 1,505.30 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా కన్జూ‍్యమర్‌ గణాంకాలు సెప్టెంబర్‌లో బలహీనంగా నమోదయ్యాయి. ఈ బలహీన గణాంకాలు వచ్చేవారంలో ఫెడ్‌రిజర్వ్‌తో పాటు పలు కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపునకు పురిగొల్పవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు అనేది పసిడి ర్యాలీకి తోడ్పాటును ప్రోత్సహించే అంశం.

టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 13 శాతం జంప్‌

Saturday 26th October 2019

మార్కెట్‌ అంచనాల్ని మించి ఫలితాల్ని వెల్లడించడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో టాటా మోటార్స్‌ అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) 13 శాతం పెరిగి 10.49 డాలర్ల వద్ద ముగిసింది. ఈ కంపెనీకి సంబంధించిన ఒక్కో ఏడీఆర్‌...ఇక్కడి 5 షేర్లకు సమానం. టాటా మోటార్స్‌ తాజా ఏడీఆర్‌ ధర ప్రకారం ఆదివారం దీపావళి సందర్భంగా జరగబోయే మూరత్‌ ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.148 సమీపంలో ప్రారంభమయ్యే ఛాన్స్‌ వుంది. శుక్రవారం

Most from this category