News


వాణిజ్య ఒప్పందం కోసం జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఆహ్వానం

Tuesday 5th November 2019
news_main1572936027.png-29362

మొదటి దశ వాణిజ్య చర్చల్లో భాగంగా ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌... చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలికినట్లు వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌(ఆసియాన్) సమావేశంలో అమెరికా వాణిజ్య చర్చల బృందంలో సీనియర్‌ సభ్యుడైన బర్ట్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ ‘‘ చైనాతో అమెరికా గొప్ప వాణిజ్య సంబంధాలను కోరుకుంటుంది. మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టేందుకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చైనా దేశాధ్యక్షుడు జింగ్‌పిన్‌ను ఆహ్వానించారు. ఒకవేళ కుదర్చబడిన ఒప్పందం ఆమోదయోగ్యమైతే మొదటి దశ ఒప్పందం విజయవంతం అవుతుంది. అది జరుగుందా లేదా అని మనం చూడాలి. మేము మాత్రం ఒప్పందం కుదురుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము’’ అన్నారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య సత్సంబంధం ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేకూరుస్తుంది. కాబట్టి అమెరికా చైనాతో సత్సంబంధాన్నే కోరుకుంటుంది. ఇదే సమయంలో మా దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుందనుకుంటే దానిని నిర్భయంగా తిరస్కరిస్తామని ఓబ్రెయిన్ తెలిపారు.  
ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద దేశాలైన అమెరికా చైనాల మధ్య రెండేళ్ల క్రితం వాణిజ్య వివాదాలు మొదలయ్యాయి. వాణిజ్య చర్చల పరిష్కారం కోసం రెండు దేశాలు గతేడాది నవంబర్‌ నుంచి చర్చలు జరుపుతున్నాయి. సుమారు 12సార్లు జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితాలు రాలేదు. చైనా దిగుమతులు తన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని సమకూరస్తుందనే నెపంతో ట్రంప్‌ చైనా దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. అందుకు ప్రతీకారంగా చైనా కూడా తమ దేశంలోకి దిగమతయ్యే అమెరికా వస్తువులపై సుంకాలను విధించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పెరిగిన వాణిజ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయాయి. You may be interested

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌ సంకేతాలు!

Tuesday 5th November 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 42 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టాటాపవర్‌, మాక్స్‌ ఫైనాన్షియల్స్‌, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌, టొరెంట్‌ పవర్‌, వరుణ్‌ బెవరేజెస్‌, షాలిమార్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రాలీస్‌ ఇండియా, చోళమండలం, సెంచరీ ప్లైబోర్డ్స్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌

పదిగ్రాముల బంగారం రూ. 50వేలు దాటేస్తుందా?!

Tuesday 5th November 2019

టెక్నికల్‌ నిపుణుల అంచనా బుల్లిష్‌గా మారిన బడా బ్యాంకులు పసిడి ధరలో ర్యాలీ మరింతగా కొనసాగుతుందని, క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2100 డాలర్ల వరకు దూసుకుపోవచ్చని ప్రముఖ కమోడిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడా బ్యాంకులు బంగారంపై పాజిటివ్‌గా మారడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే భారత్‌లో రూపాయి మారకపు విలువ ప్రస్తుత స్థాయి 71 వద్దే వుంటే...10 గ్రాముల ధర దాదాపు రూ.

Most from this category