News


కాగ్నిజంట్‌లో 12వేల ఉద్యోగాల కోత!

Thursday 31st October 2019
news_main1572503875.png-29258

రాబోయే కొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7000 ఉద్యోగాలను తగ్గించుకుంటున్నట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ తెలిపింది. దీంతో పాటు కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ వైదొలగడం కారణంగా మరో 6000 మంది ఉద్యోగాలు మాయం కానున్నాయి. వెరసి మొత్తం మీద త్వరలో కంపెనీ సుమారు 10- 12వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. మిడ్‌ నుంచి సీనియర్‌ స్థాయి ఉద్యోగుల్లో 10- 12 వేల మందిని తొలగిస్తామని వెల్లడించింది. వీరిలో 5వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి తిరిగి వేరే స్థాయిల్లో నియమించుకుంటామని తెలిపింది. దీంతో మొత్తం మీద 5- 7 మంది ఉద్యోగాలు పోవడమైతే ఖాయమని, ఇది మొత్తం కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో సుమారు 2 శాతమని వివరించింది.

ఫేస్‌బుక్‌లాంటి దిగ్గజాలకు అందిస్తున్న కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించింది. ఇందువల్ల ప్రపంచవ్యాప్తంగా తమవద్ద ఈ కంటెంట్‌ మోడరేషన్‌పై పనిచేసే 6వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోతారని తెలిపింది. అయితే వీరిని ఇతర కంపెనీల్లో సర్దుబాటు చేసే విషయంలో సహకారం అందిస్తామని తెలిపింది. కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి వైదొలగడం కంపెనీ కమ్యూనికేషన్స్‌, మీడియా, టెక్‌ విభాగ ఆదాయంపై ప్రభావం చూపుతుందని కాగ్నిజంట్‌ తెలిపింది. ఒకటిరెండేళ్లు కంపెనీ పనిపై ఈ విషయ ప్రభావం ఉంటుందన్నారు. 



You may be interested

విదేశీ బ్రోకరేజిలు టార్గెట్‌ పెంచిన షేర్లివే!

Thursday 31st October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి చాలా కంపెనీలు వాటి ఫలితాలను ప్రకటించాయి. ఫలితాలను ప్రకటించిన తర్వాత చాలా కంపెనీ టార్గెట్‌ ధరలను విదేశీ బ్రోకరేజిలు పెంచాయి.       టాప్‌ విదేశీ బ్రోకరేజిలు  టార్గెట్‌ ధరను పెంచిన టాప్‌ స్టాకులు: బ్రోకరేజి: సిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,400 నుంచి 1,520 కు పెంచింది సెప్టెంబర్‌ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 26.75 శాతం పెరిగి రూ. 6,345

మళ్లీ 1500డాలర్లపైకి పసిడి

Thursday 31st October 2019

అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పావుశాతం తగ్గించడంతో పాటు అమెరికా చైనాల మధ్య పాక్షిక ఒప్పందంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా రెండురోజుల్లో 11డాలర్ల వరకు లాభపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 1500డాలర్ల పైన 1,501.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న

Most from this category