News


అమెరికా దిగుమతులపై టారీఫ్‌లను తగ్గించిన చైనా

Thursday 6th February 2020
news_main1580985993.png-31572

గత ఏడాది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 1,717 ఉత్పత్తులపై విధించే అదనపు సుంకాలను సగానికి తగ్గిస్తున్నట్లు చైనా గురువారం తెలిపింది. ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న తొలి దశ ఒప్పందంలో భాగంగా ఈ దిగుమతులపై సుంకాలను తగ్గించుకుంటున్న చైనా అధికారులు తెలిపారు. వాణిజ్య యుద్ధంలో భాగంగా... గతేడాది సెప్టెంబర్ 1 నుంచి అమెరికా దిగుమతులపై విధించిన సుంకాల తగ్గింపు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఏడాదిన్నరగా అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరుదేశాలు వాషింగ్టన్లో ఫేజ్ 1 వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా తమ దేశానికి దిగమతయ్యే అమెరికా ఉత్పత్తులను, సర్వీసెస్‌లను రెండేళ్ల కాలంలో మొత్తం 200 బిలియన్‌ కోట్లకు పెంచుకుంటాని చైనా ఒప్పుకుంది. 

ఈ సుంకాల తగ్గింపు కరోనా వ్యాధి వ్యాప్తితో తీవ్రంగా నష్టపోయిన చైనాకు ఆర్థికంగా తోడ్పాటును అందించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చే అంశమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

చైనా సుంకాల తగ్గింపు ప్రకటన తర్వాత యెన్‌ రెండువారాల గరిష్టాన్ని అందుకుంది. ఆసియాతో పాటు అమెరికా ఫ్యూచర్లు లాభాల్లోకి మళ్లాయి. కొన్ని వస్తువులపై  టారీఫ్‌ తగ్గింపు 10శాతం నుంచి 5శాతంగా ఉంటుందని చైనా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన వస్తువుల విలువను పేర్కొనలేదు. 



You may be interested

చెక్కుల క్లియరింగ్‌ మరింత వేగంగా..

Friday 7th February 2020

చెక్కులను ఎక్కువగా వినియోగించే వారిని సంతోషపెట్టే నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. చెక్‌ ట్రంకేషన్‌ సిస్టమ్‌ (సీటీఎస్‌)ను 2020 సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్టు శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో భాగంగా వెల్లడించింది. ప్రస్తుతానికి సీటీఎస్‌ విధానం అమల్లో ఉంది కానీ, పెద్ద క్లియరింగ్‌ హౌసెస్‌ మధ్యే ఉందని ఆర్‌బీఐ స్పస్టం చేసింది. అంటే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల మధ్య లేదు. సీటీఎస్‌తో చెక్కుల క్లియరింగ్‌కు రోజుల తరబడి సమయం పట్టదు.

పెట్రోల్‌తో నడిచే విటార బ్రెజ్జా

Thursday 6th February 2020

ఆటోఎక్స్‌పో-2020లో విడుదల చేసిన మారుతీ సుజుకీ గ్రేటర్‌ నోయిడా: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విటార బ్రెజ్జాను గురువారం ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. ఈ కాంపాక్ట్‌ మోడల్‌లో బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండడం విశేషం. కొత్త విటార బ్రెజ్జాలో 1.5 లీటర్ల సామర్ధ్యం గల పెట్రోల్‌  ఇంజిన్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ పెట్రోల్‌ ఇంజిన్‌ అతితక్కువ ఉద్గారాలను వెలువరిస్తుందని కంపెనీ

Most from this category