News


27 ఏళ్ల కనిష్ఠానికి చైనా వృద్ధి

Monday 15th July 2019
news_main1563169559.png-27060

 వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా డిమాండ్‌ మందగించడంతో  చైనా వృద్ధి రెండవ క్వార్టర్‌లో మూడు దశాబ్దాల కంటే తక్కువగా నమోదయ్యిందని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో 6.4 శాతం వృద్ధి రేటు నమోదు కాగా రెండవ క్వార్టర్‌లో అది 6.2 శాతానికి పడిపోయింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన అధికారిక డేటా ఏఎఫ్‌పీ విశ్లేషకుల అంచానాలతో పోలి ఉండడం గమనర్హం. మొత్తం సంవత్సరానికి గాను చైనా  వృద్ధి అంచనాలు 6.0-6.5 శాతం పరిధిలో ఉన్నాయి. కాగా ఇది ప్రభుత్వం 2018లో పెట్టుకున్న వృద్ధి అంచనాలు 6.6 శాతం కంటే తక్కువ.
    "స్వదేశీ, విదేశాలలో ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించింది. బాహ్య అస్థిరతలు, అనిశ్చితులు పెరుగుతున్నాయి" అని ఎన్‌బీఎస్ ప్రతినిధి మావో షెంగోంగ్ తెలిపారు.‘ఈ ఏడాది ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచేందుకు చర్యలు చేపట్టినప్పటికి, దేశీయ మందగమనాన్ని, విదేశీ డిమాండ్‌ను మార్చలేకపోయింది. అతిపెద్ద వాణిజ్య భాగస్వామైన అమెరికాతో వాణిజ్య యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది’ అని అన్నారు. 
      మొదటి ఆరు నెలల్లో విదేశి ఎగుమతులు  0.1 శాతం మాత్రమే పెరిగాయని, కానీ సోమవారం విడుదల చేసిన సమాచారం మేరకు రాబోయే నెలల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.  పారిశ్రామిక ఉత్పత్తి మే లో 5 శాతం ఉండగా జూన్‌లో 6.3 శాతానికి పెరిగిందని ఆర్థిక డేటా వివరించింది.  కానీ ఈ పెరుగుదల గత పెరుగుదలల కంటే తక్కువ కావడం గమనర్హం. స్థిర ఆస్తులలో పెట్టుబడులు జనవరి-మే వ్యవధిలో 5.6 శాతం పెరిగితే జనవరి-జూన్‌ కాలానికి గాను 5.8 శాతం పెరిగాయి. మౌలిక సదుపాయాల పెట్టుబడుల వృద్ధి మాత్రం తగ్గింది. ముందు ఏడాదితో పోల్చితే దిగుమతులు, ఎగుమతులు జూన్‌ నెలలలో తగ్గాయి. పట్టణ నిరుద్యోగం మే లో 5 శాతం ఉండగా జూన్‌లో  5.1 శాతానికి పెరిగింది. రిటైల్ అమ్మకాలు (ఏడాదికి గాను) మే లో 8.6 శాతం ఉండగా జూన్‌లో 9.8 శాతానికి పెరిగాయి.  ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో వాహనాల అమ్మకాలు 12.4 శాతం తగ్గాయని చైనా వాహన తయారిదారుల అసోషియేషన్‌ తెలిపింది. 
   అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 360 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంపై విధించుకున్న సుంకాల వలన ఇరుదేశాల తయారి రంగాలు కుదేలయ్యాయి.  ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అమెరికాకు చైనా ఎగుమతులు 8 శాతానికి పైగా పడిపోయాయి.You may be interested

ఈవారం స్టాక్‌ సిఫార్సులు

Monday 15th July 2019

టైటాన్‌ కంపెనీ    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  ప్రస్తుత ధర: రూ.1,101 టార్గెట్‌ ధర: రూ.1,250 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఆభరణాల విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉందని కంపెనీ పేర్కొంది. పుత్తడి ధరలు పెరగడం, వినియోగం తగ్గడం వంటి కారణాల వల్ల ఈ విభాగం ఆదాయం 13 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇతర జ్యూయలరీ కంపెనీల మార్కెట్‌ వాటా తగ్గుతుండగా, తనిష్క్‌ బ్రాండ్‌ మార్కెట్‌ వాటా

కమర్షియల్‌ పేపర్‌ అంటే.. ?

Monday 15th July 2019

ప్ర: కమర్షియల్‌ పేపర్‌ చెల్లింపుల్లో కంపెనీలు విఫలమయ్యాయంటూ తరుచూ వార్తలు వస్తున్నాయి కదా! ఇంతకీ ఈ కమర్షియల్‌ పేపర్‌ అంటే ఏమిటి ?  -ఇంతియాజ్‌, విజయవాడ  జ: కమర్షియల్‌ పేపర్‌.... మనీ మార్కెట్‌ సాధనాల్లో ఒకటి. వీటి మెచ్యూరిటీ కాలం ఒక ఏడాది. వీటిని కంపెనీలు జారీ చేస్తాయి. బ్యాంక్‌లు జారీ చేసే వాటిని సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌గా వ్యవహరిస్తే, కంపెనీలు జారీ చేసే మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ను కమర్షియల్‌ పేపర్‌గా వ్యవహరిస్తారు.

Most from this category