News


కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌: చైనా మార్కెట్‌ సోమవారం వరకూ బంద్‌..!

Tuesday 28th January 2020
news_main1580197304.png-31268

జీజింగ్‌/షాంఘై:- చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఉధృతితో అక్కడి ప్రభుత్వం లునార్‌ వేడుక సెలవులను మరో 3రోజుల పాటు పొడిగించింది. ప్రభుత్వ ప్రకటనతో బుధవారం(జనవరి 29న) ప్రారంభం కావాల్సిన షాంఘై స్టాక్‌ ఎక్చ్సేంజీ ట్రేడింగ్‌ సోమవారంవరకూ మొదలుకాదు. లునార్‌ వేడుకల సందర్భంగా ఎక్చ్సేంజీకి జనవరి 24 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2003 ఏడాదిలో, సార్స్‌ వ్యాధి వ్యాప్తి సంభవించినపుడు మే డే హాలిడేను 4రోజులు పాటు పొడిగించారు. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో నివారణ చర్యల్లో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి 9 వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని షాంఘై అధికారులు కంపెనీలను కోరారు. వైరస్‌ వ్యాధి వాప్తితో ఇప్పటి వరకు  చైనాలో సోమవారం నాటికి 83మంది మృత్యువాత పడగా, ఇప్పటికి వరకు 2,744 కేసులను ధృవీకరించినట్లు చైనా అధికారులు తెలిపారు. 

ఆన్‌షోర్‌ మార్కెట్‌ ఈ వారమంతా పనిచేయకపోవడంతో ట్రేడర్లు తమ చైనా ఆందోళనలను వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. సింగపూర్‌లో ట్రేడయ్యే ఎఫ్‌టీఎస్‌ఈ చైనా ఎ50 ఫ్యూచర్‌ ఇండెక్స్‌ సోమవారం దాదాపు 6శాతం పతనాన్ని చూసింది. ఆఫ్‌షోర్‌లో చైనా కరెన్సీ 0.8శాతం నష్టపోయింది. 



You may be interested

యునైటెడ్‌ స్పిరిట్స్‌13 శాతం జంప్‌

Tuesday 28th January 2020

యునైటెడ్‌ స్పిరిట్స్‌ విడుదల చేసిన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉన్నందున, అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ అప్‌గ్రేడ్‌ చేయడంతో మంగళవారం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు భారీగా పెరిగింది.మధ్యహ్నం 1.30 గంటల ప్రాంతంలో 13 శాతం పెరుగుదలతో 649.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఆర్థిక సంవత్సరం-20 క్యూ3 ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 15.2 శాతం పెరిగి రూ.201.4 కోట్ల నుంచి రూ.231 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన

డాక్టర్‌ రెడ్డీస్‌పై బ్రోకింగ్‌ సంస్థలు బుల్లిష్‌

Tuesday 28th January 2020

క్యూ3 ఫలితాల నేపథ్యం టార్గెట్‌ ధరలు పెంపు ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు సాధించిన నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 570 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నువరింగ్‌సహా కొన్ని ప్రొడక్టులకు సంబంధించి రూ. 1320 కోట్లమేర ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు(నష్టం) నమోదుకావడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ

Most from this category