News


కరోనాతో షేర్లు అమ్ముకోనక్కర్లేదు: వారెన్‌ బఫెట్‌

Tuesday 25th February 2020
news_main1582620411.png-32077

షేర్లు అమ్ముకోవాల్సినంత తీవ్రత లేదు
వారెన్‌ బఫెట్‌
ప్రపంచాన్ని, మార్కెట్లను గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ భయంకరమైనదేనని, కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని షేర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదని ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ అభిప్రాయపడ్డారు. బలమైన ఎర్నింగ్స్‌ శక్తిఉన్న కంపెనీలపై పెట్టుబడులు పెట్టి, పది నుంచి ఇరవై ఏళ్లు వేచిచూసే ఇన్వెస్టర్లు మార్కెట్లో సంపదనార్జిస్తారన్నారు. ఇలాంటి వైరస్‌లు తన దీర్ఘకాలిక అవుట్‌లుక్‌ను మార్చలేవన్నారు. కానీ స్వల్పకాలానికి ఇది భయంకరమైనదేనని చెప్పారు. స్టాక్‌మార్కెట్లో మనం తీసుకోదలచిన నిర్ణయాలను ప్రభావితం చేయలేదన్నారు. సోమవారం కరోనా భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు భారీ పతనాలు నమోదు చేశాయి.

తాజాగా కరోనా వైరస్‌ చైనా నుంచి ఇటలీ, ఇరాన్‌ లాంటి సుదూర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా మరణాలు నమోదవుతున్నాయి.  దీంతో ప్రపంచ సప్లై చైన్స్‌ దెబ్బతింటాయని, తద్వారా అంతర్జాతీయ ఆర్థికం దెబ్బతింటుందన్న భయాలు పెరిగాయి. కానీ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఇలాంటి స్వల్పకాలిక వార్తలకు బెదరాల్సిన అవసరం లేదని బఫెట్‌ చెప్పారు. నిజానికి ఇలాంటి స్థితిలోనే తాను మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతానన్నారు. మార్కెట్లు ఇలా పతనమైనప్పుడే మన సొమ్ముకు బాండ్స్‌లో కన్నా షేర్లలో ఎక్కువ రాబడి వస్తుందన్నారు. యూఎస్‌ ఎకానమీ ఆరునెలల క్రితంతో పోలిస్తే కొంత మందగించిందన్నారు. తన సంస్థ బెర్క్‌షైర్‌కు చెందిన పలు వ్యాపారాలపై కరోనా ప్రభావం పడిందని తెలిపారు. బెర్క్‌షైర్‌ షేరు గతంలోలాగా ఎస్‌అండ్‌పీ 500ను మించిన రాబడినివ్వకపోవడం సహజపరిణామమేనన్నారు. కానీ తమ షేరు డౌన్‌ మార్కెట్లో మంచి ప్రదర్శన చూపుతుందన్నారు.  



You may be interested

ఈ షేర్లను హోల్డ్‌ చేయొచ్చు

Tuesday 25th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి అంతర్జాతీయ వృద్ధి మందగమనంపై ఆందోళనలు రేకత్తించడంతో ప్రపంచఈక్విటీ మార్కెట్ల తీవ్ర నష్టాలను చవిచూశాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సైతం ఈ వారంలో వరుసగా రెండో రోజూ నష్టాల బాట పట్టింది. ప్రధాన బెంచ్‌మార్క్‌ సూచీలు 2వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ప్రభుదాస్‌ లిల్లాధర్‌ 3కంపెనీల షేర్లను హోల్డ్‌ చేయమని సలహానిచ్చింది. అలాగే ఐసీఐసీఐ డైరెక్ట్‌

హడ్కో రూ. 28,000 కోట్ల సమీకరణ!

Tuesday 25th February 2020

హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) రూ.28,000 కోట్ల నిధులు సమీకరించనుంది. బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ జరిపేందుకు ఈ వారంలో బోర్డు సమావేశం జరగనుందని మంగళవారం హడ్కో వెల్లడించింది. కాగా హడ్కో అధికృత మూలధనం రూ.2500 కోట్లు కాగా,పెయిడ్‌ అప్‌ ఈక్విటీ రూ.2,001.90 కోట్లుగా ఉంది. మంగళవారం మధ్యహ్నాం 2:15 గంటల ప్రాంతంలో హడ్కో షేరు 1.55 శాతం తగ్గి 31.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

Most from this category