News


బ్రెగ్జిట్ డీల్ కుదిరింది..

Thursday 17th October 2019
news_main1571306709.png-28955

దూసుకుపోయిన బ్రిటీష్ కరెన్సీ, యూరప్ మార్కెట్లు
యూరప్, యూకే మధ్య అర్ధవంతమైన డీల్ కుదిరిందని యూరోపియన్ కమీషన్ అధ్యక్షుడు జీన్ క్లాడే జంకర్ ప్రకటించారు. ఇది ఒక నాణ్యమైన, సమతుల్యమైన ఒప్పందంగా అభివర్ణించారు. ఒక నూతన ఒప్పందం కుదిరిందని, శనివారం ఈ డీల్ ను పార్లమెంట్ ముందు ఉంచుతామని యూకే ప్రధాని చెప్పారు. డీల్ ను గురువారం ఈయూ నేతల ముందుంచుతారు. ఈయూనేతలు, బ్రిటన్ పార్లమెంట్ అనుమతి లభించిన అనంతరం డీల్ ను ఈయూ పార్లమెంట్ ఆమోదానికి పంపుతారు. డీల్ కుదిరిందన్న బ్రిటన్ ప్రధాని ప్రకటనతో ఒక్కమారుగా యూరప్ మార్కెట్లు, స్టెర్లింగ్ దూసుకుపోయాయి. తొలుత ఈ డీల్ కుదరదేమోనన్న భయాలు సర్వత్రా వ్యాపించాయి. ఐర్లండ్ కు చెందిన డీయూ పార్టీ ఈ డీల్ పై వ్యతిరేకంగా ఉండడంతో డీల్ కుదరడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికీ తాము పాత వాదనకే కట్టుబడి ఉన్నామని డీయూ పార్టీ వెల్లడించింది.

మరోవైపు డీల్ వార్తల నేపథ్యంలో దేశీయంగా ప్రధాన సూచీలు సైతం మరింత లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ 11600 పాయింట్ల సమీపానికి చేరుకుంది. దేశీయ స్టాకుల్లో టాటా మోటర్స్, టాటా స్టీల్, మదర్ సన్ సుమి షేర్లు ఒక్క ఉదుటున లాభాల్లోకి మరలాయి. టాటా మోటర్స్ షేరు ఒక్కసారిగా దాదాపు 13 శాతం వరకు దూసుకుపోయింది. మదర్ సన్ సుమీ షేరు 8 శాతం మేర, టాటా స్టీల్ దాదాపు 3.5 శాతం మేర లాభపడ్డాయి.You may be interested

బ్రెగ్జిట్‌ డీల్‌ ఎఫెక్ట్‌: టాటామోటర్స్‌ 13%, టాటా స్టీల్‌ 3% అప్‌

Thursday 17th October 2019

  బ్రిటన్‌, ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెగ్జిట్‌ ఒప్పందం కుదరడంతో టాటా మోటర్స్‌, టాటా స్టీల్‌ షేర్లు అనుహ్యాంగా పెరిగాయి. టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ కంపెనీలు బ్రిటన్‌లో ఉండడంతో బ్రెగ్జిట్‌ ఒప్పందం ఈ కంపెనీలకు మేలు చేస్తుందన్న అంచనాలతో మార్కెట్‌ ముగింపులో ఈ కౌంటర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ ఒప్పందం కుదిరినట్లు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు వార్తలు వెలువడంతో టాటా మోటార్స్‌ షేరు ఇంట్రాడేలో 15 శాతం​లాభపడి రూ. 144 గరిష్టస్థాయిని

బాలీవుడ్‌ సినిమాలు హిట్‌..పీవీఆర్‌ ఫలితాలు సూపర్‌ హిట్‌!

Thursday 17th October 2019

  సూపర్‌ 30, మిషన్‌ మంగళ్‌, చిచ్చోరే వంటి సినిమాలు బాక్స్‌ ఆఫిస్‌ వద్ద మంచి వసూల్‌ సాధించడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో పీవీఆర్‌ మంచి ప్రదర్శనను చేసింది. ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఏకికృత నికర లాభం 34.98 శాతం పెరిగి రూ. 47.88 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 35.47 కోట్లుగా నమోదైంది. కాగా విశ్లేషకులు

Most from this category