News


21ఏళ్ల తర్వాత యూరప్‌ స్టాక్స్‌600లో భారీ ర్యాలీ!

Friday 28th June 2019
news_main1561717697.png-26663

సంవత్సర ప్రథమార్ధంలో భారీర్యాలీ నమోదు చేయడం యూప్‌ మార్కెట్లో 21 ఏళ్ల తర్వాత ఈ ఏడాది కనిపించింది. కేంద్ర బ్యాంకర్ల సానుకూల కామెంట్లు, బలమైన రీబౌండ్‌ కారణంగా యూరప్‌ స్టాక్స్‌ 600 సూచీ ఈ ఏడాది ఇంతవరకు 13 శాతం లాభపడింది. ఏడాది తొలి సగభాగంలో ఈ సూచీ ఇంతలా లాభపడడం 1998 తర్వాత ఇదే తొలిసారి. ఒకపక్క యూరప్‌లోని వివిధ దేశాల సూచీల్లో షార్ట్స్‌ ఎక్కువగా నమోదవుతున్నా, స్టాక్స్‌ 600 మాత్రం బలంగా కొనసాగడం విశేషం. ఇప్పటికీ ఈ ప్రాంతంలోని ఈక్విటీలపై నిపుణులు బేరిష్‌గానే ఉన్నారు. కానీ మే అనంతరం ఈసీబీ ఉద్దీపన అంచనాలు, యూఎస్‌ రేట్‌కట్‌ ఆశలు యూరప్‌ స్టాకుల్లో ఉత్తేజం నింపాయి. యూఎస్‌, చైనా మధ్య ట్రేడ్‌ ఉద్రిక్తతలు సమసిపోవడంపై ఇంకా నీలినీడలు వీడకున్నా, యూరప్‌ ఈక్విటీలు మాత్రం పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి. వచ్చే నెల సమావేశంలో ఫెడ్‌ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు భారీగా అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే యూరప్‌ ఈక్విటీలకు బాగా పాజిటివ్‌ ఉత్తేజం వస్తుందని సిటీగ్రూప్‌ భావిస్తోంది. 1970 నుంచి ఇప్పటివరకు ఫెడ్‌ ఎప్పుడు రేట్లు తగ్గించినా, అంతకు ముందు ఆరు నెలల పాటు  యూరప్‌స్టాకులు సరాసరిన 10 శాతం, తర్వాత 12 నెలల పాటు దాదాపు 15 శాతం చొప్పున రాబడినిచ్చాయి. ఈ సారి కూడా ఇదే రిపీటవుతుందని అంతర్జాతీయ ఈక్విటీ నిపుణుల అంచనా. 



You may be interested

గ్రామీణ ఆర్ధికం మెరుగుపడితేనే వృద్ధి: డాబర్‌ సీఈఓ

Friday 28th June 2019

బడ్జెట్‌ రాయితీలు, రుతుపవనాలతో గ్రామీణ ఆర్థికం పుంజుకొంటుంది ఈ త్రైమాసికం గత త్రైమాసికం కన్నా మెరుగ్గా ఉంటుంది లిక్విడిటీ సమస్య పరిష్కారం అవుతోంది మార్కెట్‌ వాటా పెరిగితే కొత్త కొత్త ఆవిష్కరణలను ఆరోగ్య రక్షణ రంగంలో తీసుకొచ్చి వృద్ధిని సాధిస్తామని డాబర్‌ ఇండియా సీఈఓ మోహిత్‌ మల్హోత్రా ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితేనే... గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏర్పడిన మందగమనానికి

కీలక మద్దతు దిగువన 285 షేర్లు

Friday 28th June 2019

బీఎస్‌ఈ500 స్టాకుల్లో దాదాపు 285 స్టాకులు తమ 200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన ట్రేడవుతున్నాయి. ఒకపక్క సూచీలు తమ గరిష్ఠాలకు దగ్గరగా ఉన్నా, ఇవి మాత్రం కోలుకోలేదు. ఇలా నేల చూపులు చూస్తున్న స్టాకుల్లో ఐటీసీ, మారుతీ, ఏసియన్‌పెయింట్స్‌, హిందుస్థాన్‌ జింక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌, టెక్‌మహీంద్రా, డాబర్‌ఇండియా తదితరాలున్నాయి.  200 రోజుల డీఎంఏ దిగువన ట్రేడవుతున్న స్టాకుల్లో కొన్ని... కేవలం కొన్ని స్టాకుల బలంతోనే సూచీలు నిలబడుతున్నాయని,

Most from this category