News


అమెరికా-చైనా మధ్య సంధి

Saturday 29th June 2019
Markets_main1561790629.png-26684

గత కొన్ని రోజుల నుంచి అందరి దృష్ఠిని ఆకర్షిస్తున్న  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం సానుకూలంగా జరిగినట్టు తెలుస్తోంది. చైనాతో వాణిజ్య చర్చలు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాయని ట్రంప్‌ అనడం గమనార్హం. శనివారం జరిగిన ‘అద్భుతమైన’ చర్చల తర్వాత వాషింగ్టన్‌  చైనా ఉత్పత్తులపై విధించనున్న కొత్త సుంకాలను ఆపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  రెండు కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మధ్య  వాణిజ్య యుద్ధం గత ఏడాది ప్రారంభమైంది. దీనిపై చర్చలకు ఇరు దేశాధినేతలు జపాన్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌ను ఉపయోగించుకున్నారు.  ‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం సానుకూలంగా జరిగింది. సానుకూలం అనడం కన్నా  అద్భుతంగా జరిగింది అని అనవచ్చు’ అని ఇరువురి సమావేశం తర్వాత ట్రంప్‌ అన్నారు. ఒప్పందాలకు సంబంధించిన విషయాలను చెప్పకుండా ‘మేము తిరిగి ట్రాక్‌లోకి వచ్చాం’ అని తెలిపారు. ఈ సమావేశ వివరాలను అధికారిక ప్రకటన ద్వారా తెలిపే అవకాశం ఉందని ఇరువర్గాలు అంచనా వేస్తున్నాయి.

 చైనా ఎగుమతులపై కొత్త సుంకాలను అమెరికా విధించదని, ఇరుదేశాలు వాణిజ్య, ఆర్థిక చర్చలను పునఃప్రారంభించాడానికి అంగీకరించాయని చైనా మీడియా ప్రకటించింది. ఇరుదేశాల మధ్య పూర్తి ఒప్పందం జరగకపోవచ్చు కానీ సంధి జరగడం వలన కొత్తగా సుం‍కాల పోరు తప్పుతుందని ఇది సానుకూల పరిణామమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. తమతో సంధికి రాకుంటే ‘చైనా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది’ అని హెచ్చరిస్తూనే, చైనాతో రాజీ కుదుర్చుకునేందుకు ఈ సమావేశం ముందునుంచే ట్రంప్‌ సిద్దపడ్డారు.  ఇరుదేశాల అధ్యక్షలు చర్చలను బహిష్కరించాకా జిన్‌పింగ్‌ ఘర్షణ కన్నా చర్చలు ఫలితాలనిస్తాయని తెలిపిన విషయం తెలిసిందే.  చైనాతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకొనేందుకు ఎదురుచూస్తున్నాం అని ట్రంప్‌ కూడా అన్నారు. 
   ఈ సమావేశంలో ముఖ్యంశాలు ఇంకా బయటకు రాలేదు. చైనా టెలికాం కంపెనీ హువాయ్‌ విషయాన్ని గురించి ప్రస్తావించారో లేదో తెలియలేదు. అమెరికా రక్షణ పరమైన చర్యలలో భాగంగా హువాయ్‌ కంపెనీని అమెరికాలో రద్దు చేసింది. ఈ అంతరాయాలను వాణిజ్య సంధిలో భాగంగా ఎత్తివేయాలని చైనా కోరిన విషయం తెలిసిందే. వాణిజ్యయుద్ధంతో పాటు బ్రెక్సిట్‌, అంతర్జాతియ రాజకీయ ఒత్తిళ్లు కారణాన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ఆర్ధికవేత్తలు అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌, దక్షిణ అమెరికా వాణిజ్య కూటమి మెర్కోసర్‌ 20 ఏళ్ల వాణిజ్య చర్చలకు శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది నిబంధనల ఆధారిత వాణిజ్యానికి బలమైన సందేశం అని యూరోపియన్‌ కమీషన్‌ ప్రెసిడెంట్‌ జీన్‌ క్లాడ్‌ జంకర్‌ అన్నారు. 
      ట్రంప్‌ హెడ్‌లైన్స్‌తో జీ20 మీటింగ్‌లో ఆదిపత్యాన్ని సాగించారు. ఈ వారం చివరిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జో ఉన్‌తో దక్షిణ కొరియాలో సమావేశం కానున్నానని శనివారం ఉదయం ట్వీట్‌ చేశారు. ‘ఉత్తర కొరియా అధ్యక్షుడు దీనిని చూస్తే, అతన్ని బోర్డర్‌/డీఎమ్‌జెడ్‌ వద్ద కలిసి చెతులు కలిపి హల్లో చెబుతాను’ అని ట్వీట్‌ చేశారు. You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 29th June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌ ముగిసింది. అమెరికా రాత్రి ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,413.79 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, జూలైలో ఫెడ్‌వడ్డీరేట్ల కోత అంచనాలపై ఆశాహనంతో పసిడి ధర 2016 తరువాత ఒకనెలలో అతిపెద్ద లాభాల్ని ఆర్జించింది. ఈ జూన్‌ నెలలో  ఆగస్టు పసిడి ఫ్యూచర్ల కాంట్రాక్టు ధర ఏకంగా 7.8శాతం ర్యాలీ చేశాయి.  బలమైన

11850పై ఎస్‌జీఎక్స్‌ ముగింపు

Saturday 29th June 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11850పై ముగిసింది. సింగపూర్‌ మార్కెట్లో నిన్న రాత్రి 16.50 పాయిం‍ట్ల లాభంతో 11,854.50 వద్ద ముగిసింది. నేడు జీ-20 సదస్సులో అమెరికా- చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలమవుతాయనే ఆశావహనంతో నిన్న యూరప్‌ మార్కెట్లతో అమెరికా మార్కెట్లు సైతం లాభంతో ముగిశాయి. అమెరికాలోని ప్రధాన ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 39 పాయింట్లు లాభపడి 8000 స్థాయిపై 8,006.24 వద్ద, డౌజోన్స్‌

Most from this category