News


అత్యంత విలువైన కంపెనీ ఆపిల్‌ కాదు..అరామ్‌కో!

Wednesday 30th October 2019
news_main1572429836.png-29237

9నెలల్లో రూ. 4.8లక్షల కోట్ల ఆదాయం.... ఆపిల్‌ సహా దిగ్గజాలను మించిన సంపాదన... సంవత్సరాంతానికి లిస్టింగ్‌కు..
ప్రపంచంలోని కార్పొరేట్‌ కంపెనీలన్నింటిలోకి అత్యంత ఖరీదైన కంపెనీ ఏది? చాలామంది ఆపిల్‌ అనుకుంటారు, కొందరు గూగుల్‌ అని, కొందరేమో మైక్రోసాఫ్ట్‌ అని అoటారు. ఎందుకంటే ఇవన్నీ లిస్టయిన కంపెనీలు వీటి మార్కెట్‌ క్యాప్‌, ఆదాయవ్యయాల వివరాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతుంటాయి.  కానీ వీటన్నింటినీ తలదన్నే కంపెనీ ఒకటుంది...   

ఒక ఆపిల్‌, ఒక గూగుల్‌, ఒక ఎక్సాన్‌ మొబైల్‌ను కలిపితే ఎంత విలువుంటుందో, అంతటి విలువైన కంపెనీ అది.. 
అయితే ఈ కంపెనీ ఇంత విలువైందని తెలియకపోవడానికి కారణం.. చాలా సింపుల్‌ ఇంతవరకు ఈ కంపెనీ లిస్టింగ్‌ కాకపోవడమే! 
ఇప్పుడు ఈ అత్యంత విలువైన కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రావాలని నిర్ణయించుకోవడం వల్ల దీని ఆదాయాలు, లాభాల కథా కమామీషు తెలిసాయి. 
ఇంతకీ ఆ కంపెనీ ఏంటనుకుంటున్నారా?.. 
అదే సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ అరామ్‌కో!!!

ఈ ఏడాది తొమ్మిదినెలల కాలానికి 6800 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించినట్లు సౌదీకి చెందిన దిగ్గజ కంపెనీ సౌదీ ఆరామ్‌కో ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ. 4.76 లక్షల కోట్లకు సమానం. ఈ ప్రకటనతో ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత లాభదాయకమైన కంపెనీగా అరామ్‌కో నిలిచింది. త్వరలో ఐపీఓకి రావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తన ఫైనాన్షియల్స్‌ను ఆఫర్‌ మేనేజర్లకు వెల్లడించింది. ఈ వివరాల్లో కంపెనీ కేవలం 9 నెలల్లో 4.76 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు తెలిపిందని సంబంధితవర్గాలు తెలియజేసాయి. ఈ విషయమై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ గతేడాది మాత్రం కంపెనీ స్వయంగా తన ఆర్జిన వివరాలు తెలిపింది. గతేడాది 11100 కోట్ల డాలర్ల రెవెన్యూ వచ్చిందని అరామ్‌కో తెలిపింది. కంపెనీ ఐపీఓ ప్రక్రియ వచ్చే ఆదివారం ఆరంభం కానుంది. 

(ఫొటో.. బ్లూమ్‌బర్గ్‌ సౌజన్యంతో)
మూడింటి నికర ఆదాయమంత..
గతేడాది కంపెనీ నికరాదాయం మొత్తం ప్రపంచంలో టాప్‌కంపెనీలు(ఆర్జన పరంగా)పరిణగించే ఆపిల్‌, ఎక్సాన్‌, గూగుల్‌ నికర ఆదాయాల కన్నా ఎక్కువ. ప్రస్తుతం బయటకువచ్చిన వివరాల ప్రకారమైతే కంపెనీ 9 నెలల ఆదాయం గతేడాది ఆపిల్‌ ఆదాయం కన్నా, ఎక్సాన్‌ మొబైల్‌ మొత​ం ఎర్నింగ్స్‌కన్నా ఎక్కువ. ఈ ఏడాది చివరకు అరామ్‌కో లిస్టింగ్‌ పూర్తి చేయాలని సౌదీ గట్టిగా భావిస్తోంది. కంపెనీ బలమైన లాభార్జన, తమ దేశంలోని చమురునిల్వలు.. ఐపీఓకి అద్భుత స్పందన తెస్తాయని సౌదీ యువరాజు ఆశిస్తున్నాడు. చమురు ధరలు తగ్గడంతో కుదైలైన ఎకానమీకి ఈ ఐపీఓతో నిధుల కొరత తీరుతుందని సౌదీ ఆశిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ 11న అరామ్‌కో షేర్లు సౌదీ స్టాక్‌ ఎక్చేంజ్‌లో లిస్టవుతాయని ఆదేశ మీడియా వెల్లడిస్తోంది. వచ్చే ఏడాది కంపెనీ 7500 కోట్ల డాలర్ల డివిడెండ్‌ అందించాలని భావిస్తోంది. చమురు చరిత్రలో సంక్షోభం ఎదురైన ఈ సందర్భాల్లోనే కంపెనీ మంచి ఆర్జన చూపినందున, భవిష్యత్‌లో మరింత మెరుగైన గణాంకాలు నమోదు చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. You may be interested

వెలుగులో టెలికాం షేర్లు

Wednesday 30th October 2019

టెలికాంకు బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం కమిటీని వేసేందుకు దృష్టి సారిస్తుందన్న వార్తలు వెలుగులోకి రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో టెలికాం షేర్లు రివకరీ బాట పట్టాయి. గతవారంలో టెల్కోల నుంచి రూ.92,000 కోట్ల వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్‌కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్ర, మంగళవారాల సెషన్స్‌ టెలికాం రంగ షేర్లు భారీగా నష్టపోయాయి.  సర్వీస్‌ ప్రోవైడర్లు ఎదుర్కోంటున్న ఆర్థిక ఒత్తిళ్లను అన్ని కోణాల్లో

ఆదాయపన్ను తగ్గింపులు లేనట్లే!

Wednesday 30th October 2019

ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ...! వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు ఉంటుందన్న ఊహాగానాలను ‍ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వచ్చే బడ్జెట్లో సైతం ఎలాంటి పన్ను తగ్గింపులుండవని ఈ వర్గాలు స్పష్టం చేసినట్లు సీఎన్‌బీసీటీవీ 18 తెలిపింది. ఇతర దేశాల్లో మన కన్నా ఎక్కువ ఐటీ ఉందని, దీనికితోడు ప్రస్తుత విత్త పరిస్థితి ఎలాంటి ఐటీ తగ్గింపునకు ఆస్కారమివ్వదని వివరించాయి. కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గిస్తూ సెప్టెంబర్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానంతరం, వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గిస్తుందన్న

Most from this category