చైనాను వీడనున్న 13% కంపెనీలు: ట్రంప్
By Sakshi

సెప్టెంబర్ 1 నుంచి చైనా దిగుమతులపై విధించనున్న సుంకాల వలన సమీప భవిష్యత్తులో 13 శాతం కంపెనీలు చైనాను వీడతాయని శుక్రవారం యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా సుంకాలను విధించడంతో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ట్రేడ్‌వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘చైనా తనకు తానుగా ఈ పరిస్థితిని తెచ్చుకుంది. సమీప భవిష్యత్తులో సుమారుగా 13 శాతం కంపెనీలు చైనాను వీడనున్నాయి. ఇంత మొత్తంలో కంపెనీలు చైనాను వీడతాయని నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు. ఈ కంపెనీలు సుంకాలతో పోటి పడలేవు’ అని ట్రంప్ అన్నారు. ‘సెప్టెంబర్ 1 నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై తాజాగా విధించిన సుంకాలు అమలవుతాయి. ఈ సుంకాల ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయం యుఎస్‌కు వస్తుంది. కానీ చైనా సుంకాలను ఎదుర్కోడానికి తన కరెన్సీ విలువను తగ్గించుకుంటుంది. ఇది చివరికి వారికే హాని కలిగిస్తుంది. బయట దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు చైనా ఎక్కువ ఖర్చుపెట్టవలసి వస్తుంది’ అని ఆయన అన్నారు. యుఎస్ ఉత్పత్తులపై చైనా సుంకాలను విధిస్తున్నప్పటికి యుఎస్ ఎక్కువగా చెల్లించడం లేదని, దీనికి బదులుగా యుఎస్ చైనా ఉత్పత్తుల నుంచి పది రెట్లు అధికంగా ఆదాయాన్ని పొందుతుందని ట్రంప్ తెలిపారు. ‘నేను యుఎస్ రైతులకు 16 బిలియన్ డాలర్లు ఇచ్చాను. ఇది చైనా ఒక ఏడాది ఖర్చుపెట్టే విలువకు సమానం. చైనా యుఎస్ రైతులను టార్గెట్ చేస్తోంది. అందుకే రైతులకు ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఇచ్చాను’ అని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని, తన పోరాటాన్ని కొనసాగించాలని వారు కొరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ‘నేను పోరాటంలో గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఈ పోరాటంలో మేము విజయం సాధిస్తాం’ అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. యుఎస్ ప్రభుత్వం చైనాతో చర్చలను కొనసాగిస్తుందని తెలిపారు. ‘ ఇరు దేశాల మధ్య సమావేశాల షెడ్యూల్ పూర్తయింది. సెప్టెంబరులో సమావేశం కొనసాగుతోందని అనుకుంటున్నా. ఇది ఇప్పటికైతే రద్దు కాలేదు’ అని ట్రంప్ అన్నారు. దీనితో పాటు చైనాను చాలా కంపెనీలు విడిచిపెట్టాయని, ఇంకెన్నో విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ‘ఈ సుంకాల పోరు వలన చైనాకే అధిక నష్టం జరుగుతోంది. గతంలో చైనా నుంచి 10 సెంట్లు కూడా యుఎస్‌కు వచ్చేది కాదు. ఇప్పుడు చైనా నుంచి బిలియన్, బిలయన్ డాలర్లను యుఎస్ పొందుతోంది’ అని ట్రంప్ అన్నారు.
You may be interested
చత్తీస్‌గఢ్ స్టీల్ ప్లాంట్ 2020లో రెడీ
Saturday 31st August 2019ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ చత్తీస్‌గఢ్‌లో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంటు పనులు చకచకా సాగుతున్నాయి. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. 2020 అక్టోబరు-డిసెంబరులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సంస్థ సీఎండీ ఎన్.బైజేంద్ర కుమార్ శుక్రవారం జరిగిన 61వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. ‘చత్తీస్‌గఢ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి కొత్త గనుల అభివృద్ధి
తాన్లా చేతికి గమూగా సాఫ్ట్‌టెక్
Saturday 31st August 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- క్లౌడ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న తాన్లా సొల్యూషన్స్ బిగ్ డేటా, ఏఐ ఆధారిత మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ గమూగా సాఫ్ట్టెక్ను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ.48.5 కోట్లు. 2011లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన గమూగా టర్నోవర్ 2017-18లో రూ.5.7 కోట్లు. రిలయన్స్, టైటాన్, స్విగ్గీ, జూమ్‌కార్, రెడ్‌బస్ వంటి 40కిపైగా కంపెనీలకు సేవలందిస్తోంది.