News


పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం

Monday 16th December 2019
news_main1576488019.png-30249

టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణ సూచీ  నవంబర్‌లో 0.58శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో ఇది 0.16శాతంగా నమోదైంది. గతేడాది ఇదే నవంబర్‌లో ఇది 4.47శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయల ధరలు పెరగడంతో నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.

  • ప్రైమరీ ఆర్టికల్‌ విభాగంలో ధరల పెరుగుదల అక్టోబర్‌లో 6.4శాతంగా నమోదుకాగా, ఈ నెలలో 7.7శాతానికి ఎగిసింది
  • ఫుడ్‌ ఆర్టికల్స్‌ విభాగంలో ధరలు అక్టోబర్‌ నెలలో 9.8శాతంగా ఉండగా, ఈ నవంబర్‌లో 11.1శాతానికి పెరిగింది.
  • నాన్‌-ఫుడ్‌ ఆర్టికల్స్‌  ద్రవ్యోల్బణ తగ్గుముఖం పట్టింది. గత నెలలో 2.4శాతం నుంచి 1.93 శాతానికి దిగివచ్చింది
  • ఇంధన, విద్యుత్‌ ఇండెక్స్‌ 8.3శాతం నుంచి 7.93శాతంగా నమోదైంది. 
  • తయారీ రంగ ఉత్పత్తి ద్రవ్యోల్బణం క్రితం నెలలో నమోదైనట్లుగానే 0.84శాతంగా నమోదైంది. 



You may be interested

లాంగ్‌టర్మ్‌కు మెటల్స్‌ వద్దు!

Monday 16th December 2019

సుదీప్‌ బందోపాధ్యాయ సూచన షార్ట్‌టర్మ్‌కు ఓకే కానీ, దీర్ఘకాలానికి మెటల్‌ కౌంటర్ల జోలికి పోకపోవడం మంచిదని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు చూస్తే మెటల్‌స్టాక్స్‌కు బ్రెగ్జిట్‌ పాజిటివ్‌ వార్తని చెప్పారు. దీనికితోడు చైనాలో మెటల్‌స్టాకుల రీస్టాకింగ్‌ జరుగుతోందని, అందువల్లే ఈ కౌంటర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోందని చెప్పారు. కానీ ఇది చాలా స్వల్పకాలికమన్నారు. వీటన్నిటికన్నా ముఖ్యమైన ట్రేడ్‌వార్‌పై వ్యాఖ్యానిస్తూ ఈ యుద్ధం ముగిసిందని తాను భావించడం

ఎస్‌బీఐ క్యాప్‌ నుంచి రెండు రికమండేషన్లు

Monday 16th December 2019

లాంగ్‌టర్మ్‌కోసం రెండు షేర్లను ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి మహంతేశ్‌ సబారద్‌ సిఫార్సు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈక్విటీలు మంచి ప్రదర్శన చూపుతాయని, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్‌లో జోరు తెచ్చే ట్రిగ్గర్స్‌ ఏమీ లేవని అభిప్రాయపడ్డారు.  1. అతుల్‌ లిమిటెడ్‌: టార్గెట్‌ రూ. 5000. ఇటీవలే ఈ షేర్ల కవరింగ్‌ మొదలుపెట్టామని మహంతేశ్‌ చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ నుంచి ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ వరకు పలు ఉత్పత్తులు సంస్థ తయారు చేస్తోంది. విక్రయాలు క్రమంగా

Most from this category