News


మూడేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Thursday 14th November 2019
news_main1573727559.png-29594

దేశీయ హోల్‌సేల్‌ ద్యవ్యోల్బణం(డబ్ల్యూపీఐ, టోకు ద్రవ్యోల్బణం)  అక్టోబర్‌ నెలలో స్వల్పంగా తగ్గి 0.16 శాతంగా నమోదైంది. ఈ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 0.33 శాతంగా ఉంది. ఆహర పదార్దాల ధరలు పెరగడంతో డబ్యూపీఐ ఇండెక్స్‌ నెగిటివ్‌ జోన్‌లోకి వెళ్లలేదని విశ్లేషకులు తెలిపారు. కాగా అక్టోబర్‌ నెల డబ్యూపీఐ ద్రవ్యోల్బణం గత మూడేళ్లలో కనిష్ఠం కావడం గమనార్హం. తయారీరంగ వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో -0.84 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌ నెలలో -0.42 శాతం ఉంది. ఇది వ్యవస్థలో డిమాండ్‌ మందగమనం ఉందనే సంకేతాన్నిస్తుందని విశ్లేషకులు అన్నారు. అదేవిధంగా డబ్యూపీఐ కోర్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో -1.6 శాతంగా నమోదుకాగా,  సెప్టెంబర్‌ నెలలో ఇది 1.1 శాతంగా నమోదైంది. కమోడిటీ ధరలు మరింత తగ్గాయనే సంకేతాన్ని ఇది ఇస్తోందని విశ్లేషకులు తెలిపారు. 
   ఆహార పదార్ధల ద్రవ్యోల్బణం నెల ప్రాతిపదికన 7.47 శాతం నుంచి అక్టోబర్‌ నెలలో 9.8 శాతంగా నమోదైంది. ఫలితంగా డబ్యూపీఐ ద్రవ్యోల్బణం ఇండెక్స్‌ నెగిటివ్‌ జోన్‌లోకి పడిపోలేదు. ఇంధన, పవర్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో -8.27 శాతంగా నమోదు కాగా, సెప్టెంబర్‌లో -7.05 శాతంగా నమోదైంది. ప్రాథమిక వస్తువుల డబ్యూపీఐ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో 6.41 శాతంగా ఉండగా, ఇది సెప్టెంబర్‌ నెలలో 5.54 శాతంగా నమోదైంది. సీపీఐ(వినియోగదారుల ధర సూచీ) ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో 4.62 శాతంగా నమోదైంది. ఇది గత 16 నెలలో గరిష్ఠం కావడం గమనార్హం. రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 3.99 శాతంగా నమోదైంది. ఆహార పదార్ధల ధరలు పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యాన్ని మించింది. దేశీయ ద్రవ్యోల్బణ బాస్కెట్‌లో సగానికి పైగా వెయిటేజ్‌ ఉన్న రిటైల్‌ ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో ఏడాది ప్రాతిపదికన 7.89 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌ నెలలో 5.11  శాతంగా ఉంది. 
     సీపీఐ, డబ్యూపీఐ ఇండెక్స్‌ల డేటా తేడాగా ఉంటుంది. ఈ ఇండెక్స్‌లలోని వివిధరకాల వస్తువులకు ఉన్న వెయిటేజి ఆధారంగా వీటి డేటా మారుతుంటుంది. సీపీఐ ఇండెక్స్‌లో ఆహార పదార్ధాలకు వెయిటేజ్‌ అధికంగా ఉంటే, హోల్‌సేల్‌ బాస్కెట్‌లో తయారిరంగ వస్తువులకు అధిక వెయిటేజ్‌ ఉంటుంది. 



You may be interested

చూస్తూ చూస్తూ తప్పులో కాలేయొద్దు!

Thursday 14th November 2019

ఆలస్యమైనా సురక్షిత రాబడికే ప్రాధాన్యమివ్వండి మార్కెట్లో ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి నీలేశ్‌ షా ప్రస్తుతానికి తాము టెలికం స్టాకులపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని, తమ నిర్ణయం ధైర్యవంతమైన నిర్ణయమా? తెలివితక్కువ నిర్ణయమా? అనేది కాలం తేలుస్తుందని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌షా వ్యాఖ్యానించారు. నిరంతరం నష్టాలు, కష్టాల బాటలో పయనిస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడుల కన్నా మందకొడి వృద్ధి నమోదు చేసే బోరింగ్‌ వ్యాపారాల్లో పెట్టుబడులే నయమని కాలం నేర్పిన పాఠమని చెప్పారు. ఒక నిపుణుడిగా టెలికాం రంగంపై

జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గించిన మూడీస్‌

Thursday 14th November 2019

  విదేశీ రేటింగ్‌ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌, 2019కి గాను ఇండియాపై తన జీడీపీ వృద్ధి రేటు అంచనాలను  5.6 శాతానికి గురువారం తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగ రంగంలోని మందగమనంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం లేదని ఈ బ్రోకరేజి తెలిపింది. ‘ఇండియా జీడీపీ వృద్ధి రేటును సవరిస్తున్నాం. గతేడాది 7.4 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 5.6 శాతానికి తగ్గుతుందని అంచనావేస్తున్నాం’

Most from this category