News


ఇండియా వృద్ధిరేటు అంచనాలు యథాతధం!

Wednesday 5th June 2019
news_main1559734034.png-26118

7.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ‍ప్రకటించిన ప్రపంచ బ్యాంకు
భారత ఎకానమీ వృద్ధిరేటు వచ్చే మూడేళ్ల పాటు 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేట్‌ వినిమయంలో జోరు కారణంగా ఎకానమీలో వృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.2 శాతం ఉంటుందని అంచనా వేశామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. కానీ భారత జీడీపీ గత సంవత్సరం 6.8 శాతం వృద్ధినే నమోదు చేసింది. ఇందుకు ఎన్నికల అస్థిరత్వం కారణంగా పెట్టుబడులు మందగించడమే కారణమని, మొత్తం మీద దేశ ఎకానమీ బలంగా ఉందని బ్యాంకు పేర్కొంది. ప్రభుత్వ వినిమయంలో మందగమనం వచ్చినా, బలమైన పెట్టుబడులు, ముఖ్యంగా ఇన్‌ఫ్రా వ్యయాలు పెరగడం కలిసివచ్చిందని బ్యాంకు నివేదికలో తెలిపింది. నాలుగో త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే రెండేళ్లు భారత్‌ 7.5 శాతం రేటును సాధించగలదని బ్యాంకు తెలిపింది. ఇదే సమయంలో చైనా ఈ ఏడాది 6.2 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం, ఆపై ఏడాది 6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. దీంతో 2021నాటికి చైనాతో పోలిస్తే భారత వృద్ధి 1.5 శాతం అధికంగా ఉండనుంది. అంతేకాకుండా వర్ధమాన దేశాల్లో వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్‌ ప్రత్యేకత నిలుపుకోనుంది. క్రెడిట్‌ గ్రోత్‌లో మెరుగుదల వినిమయాన్ని పెంపొందిస్తునందని, పారిశ్రామక రంగం ఉత్పత్తిలో మెరుగుపడుతుందని బ్యాంకు తన నివేదికలో అంచనా వేసింది. గతేడాది చివర్లో కనిపించిన మందగమనం ఈ ఏడాది ప్రథమ త్రైమాసికంలో కొనసాగిందని, కానీ ఇకపై ఈ మందగమనం తొలగిపోతుందని తెలిపింది. భారత్‌, పాకిస్తాన్‌లో విత్తలోటు అంచనాలకన్నా అధికంగానే ఉండొచ్చని నివేదిక పేర్కొంది. 



You may be interested

2025 నాటికి సెన్సెక్స్‌... 1,00,000: కార్వీ

Wednesday 5th June 2019

ఎన్నికల ఘట్టం ముగిసిపోయింది. మోదీ సర్కారుకే దేశ ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఇప్పటి వరకు నిధులతో వేచి చూసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు పెట్టుబడి అవకాశాల అన్వేషణలో పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల అండతో దేశీయ సూచీలు నూతన రికార్డు స్థాయిలకు దూసుకుపోవడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే, తమ పోర్ట్‌ఫోలియోలో వేటిని చేర్చుకోవాలన్న మీమాంసతో ఉన్న ఇన్వెస్టర్లు ఎందరో ఉన్నారు. ఇక ముందు మార్కెట్లలో రాబడులు అన్నవి కంపెనీల ఆర్థిక

రేట్‌ కట్‌ దిశగా ఫెడ్‌!

Wednesday 5th June 2019

సంకేతాలిచ్చిన జెరోమ్‌ పావెల్‌ భారీగా లాభపడ్డ యూఎస్‌ మార్కెట్‌ ఆర్థిక మందగమన భయాలు యూఎస్‌ ఫెడ్‌ను వడ్డీరేట్ల తగ్గింపు దిశగా అడుగులు వేయిస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎకానమీలో అవసరపడితే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్‌ చైర్మన్‌ జోరోమ్‌ పావెల్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌, చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ముదిరిపోతున్న నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ట్రేడ్‌వార్‌ అంశాలు ఎప్పుడు, ఎలా పరిష్కారమవుతాయో తనకు తెలీదని చెప్పారు. అన్ని పరిస్థితులను యూఎస్‌

Most from this category