News


పొదుపులో మహారాణులు

Monday 9th March 2020
news_main1583738620.png-32367

  • 68 శాతం సొంతంగా మనీ మేనేజ్‌మెంట్‌

న్యూఢిల్లీ: భారతీయ మహిళలు చక్కగా పొదుపు చేయడంతోపాటు తమ పెట్టుబడులను తామే చక్కగా నిర్వహించుకుంటున్నారని స్క్రిప్‌బాక్స్‌ (ఆన్‌లైన్‌లో ఫైనాన్షియల్‌ సర్వీసులను ఆఫర్‌ చేసే కంపెనీ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 68 శాతం మంది తమ డబ్బును తామే పెట్టుబడులు పెడుతున్నామని లేదా తమ కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో తమకు సమాన భాగస్వామ్యం ఉందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 10 శాతం మంది ఆర్థిక నిర్ణయాలను కుటుంబంలో పురుషులకు వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. 80 శాతం మంది తాము నెలవారీ పొదుపు విషయంలో క్రమశిక్షణగా ఉంటున్నామని తెలుపగా, ఆదాయంలో కనీసం 20 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కేటాయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 600 మంది మహిళల అభిప్రాయాలను సమీకరించి, ఆ వివరాలను ఈ సంస్థ విడుదల చేసింది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో మహిళలు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు ఈ సర్వే తేల్చింది. డిజిటల్‌ చానల్స్‌ రూపంలో సమాచారం అందుబాటు పెరగడం ఇందుకు సాయపడుతున్నట్టు తెలిపింది. తాము విషయాలను తెలుసుకునేందుకు డిజిటల్‌ చానల్స్‌పై ఆధారపడుతున్నామని, వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో సలహాలు తీసుకుంటున్నామని 44 శాతం మంది సర్వేలో భాగంగా చెప్పారు.  
స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌కే ఓటు
పెట్టుబడుల వేదిక ‘గ్రోవ్‌’ నిర్వహించిన మరొక సర్వేలో 82 శాతం మంది మహిళలు తమ లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటన్నట్టు చెప్పారు. 26,000 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. 43 శాతం మంది మహిళలు సంప్రదాయ సాధనాలైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పీపీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం కూడా వారికి ఆకర్షణీయమైన సాధనంగానే ఉంది. 25 శాతం మంది తమ ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పేర్కొనడం గమనార్హం. 13 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌, 9 శాతం మంది పెన్షన్‌ సాధనాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నారు. 64 శాతం మంది ఆర్థిక అంశాల పట్ల నమ్మకంతో పెట్టుబడుల నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. You may be interested

ఏడాది కనిష్టానికి పడిపోయిన 660 షేర్లు

Monday 9th March 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 660 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో  20 మైక్రాన్స్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆదిత్యా మిర్లా క్యాపిటల్‌, అదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, అద్వాని హోటల్స్‌ అండ్‌ రిసార్ట్‌​‍్స ఇండియా, అండ్వాన్డ్‌​ ఎంజెమై్‌ టెక్నాలజీస్‌, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌,అగ్రిటెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, అమ్మీర్‌ రియాల్టీ అండ్‌

పెట్రో, ఎయిర్‌లైన్స్‌ షేర్లు రయ్‌.. రయ్‌

Monday 9th March 2020

ముడిచమురు పతన ప్రభావం  9-7 శాతం దూసుకెళ్లిన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ 5 శాతం ఎగసిన ఇండిగో- స్పైస్‌జెట్‌ 3 శాతం ప్లస్‌ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఏకంగా 30 శాతం కుప్పకూలడంతో దేశీయంగా కొన్ని రంగాలకు లబ్ది చేకూరనుంది. ఓవైపు ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు తొలి నుంచీ భారీ అమ్మకాలకు ఎగబడటంతో ఇండెక్సులు భారీగా దిగజారినప్పటికీ పెట్రో మార్కెటింగ్‌, విమానయాన రంగాల కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. పతన మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు

Most from this category