News


ఫెడ్‌ ఆకస్మిక రేట్ల కోత: భారత్‌లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు పెరుగుతాయా..?

Wednesday 4th March 2020
news_main1583319841.png-32280

కరోనా వైరస్‌ వ్యాధి ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు విస్తరిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ వడ్డీరేట్లపై అత్యవసరంగా 50 బేసిస్‌ పాయింట్ల కోత విధించింది. అనూహ్యంగా ప్రపంచ మార్కెట్లు రేట్ల తగ్గింపు ఈక్విటీ మార్కెట్లను మెప్పించకపోవడంతో ఆయా దేశాల స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

రేట్ల తగ్గింపు ఇన్వెస్టర్లు స్వాగతించకపోగా మరింత అప్రమత్తత వహిస్తూ అమ్మకాల మొగ్గుచూపారు. వాస్తవానికి మార్చి 17-18 తేదీల్లో ఫెడ్‌ రిజర్వ్‌ సమీక్షా సమావేశాల్లో తగ్గించాల్సి వడ్డీరేట్లను ఎలాంటి షెడ్యూల్‌ లేకుండానే అత్యవసరంగా రేట్ల కోత విధించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలకు ఆజ్యం పోసిందని కొందరి విశ్లేషకులు వాదిస్తున్నారు.

ప్రపంచ ఉత్పాదక కర్మాగారమైన చైనా నుంచి సప్లై అంతరాయాలు ఏర్పడటం, దాని ప్రభావం అమెరికా కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో తప్పనిసరిగా ఫెడ్‌ అత్యవసర వడ్డీరేట్ల కోత వైపు మొగ్గుచూపి ఉండవచ్చు. కానీ సమస్య నుండి బయటపడటానికి ద్రవ్య చర్యల కంటే ప్రపంచానికి ఆర్థిక అవసరం ఎక్కువ మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాత్రికి రాత్రే ఫెడ్‌రిజర్వ్‌ అత్యవసర వడ్డీరేట్ల తగ్గింపు అంశం దలాల్‌ స్ట్రీల్‌ ఇన్వెస్టర్ల మదిలో రెండు ప్రశ్నలను లేవనెత్తింది. 
(1). ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యత సడలించడంతో భారతదేశంలోకి విదేశీ ప్రవాహాల పెరుగుదలను ఉంటుందా.? 
(2). ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు బాటలో ఆర్‌బీఐ సైతం పాలసీ రేట్లను మరింత తగ్గిస్తుందా..?

ఈ రెండు ప్రశ్నలకు విశ్లేషకుల దగ్గర కూడా స్పష్టమైన సమాధానాలు లేవు.

ఫెడ్‌ రేట్ల తగ్గింపు: దేశీయ మార్కెట్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులు
ఒకసారి చరిత్రను మననం చేసుకుంటే... ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించిన ప్రతిసారి వర్థమాన దేశాల్లో ఇండియాతో సహా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకే మొగ్గుచూపారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వర్ధమాన దేశాల మార్కెట్లు కూడా కరోనా వైరస్ భయాలను,  ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోంటున్న నేపథ్యంలో విశ్లేషకులు మిశ్రమ దృక్పథాన్ని కలిగి ఉన్నారు.

అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం అంటే వర్థమాన మార్కెట్లలోకి కొంత డబ్బు ప్రవాహం ఉంటుంది. అయితే ఈసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కాబట్టి విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా రక్షణాత్మక సాధనాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని స్పార్టన్ క్యాపిటల్ సెక్యూరిటీస్ అధినేత పీటర్ కార్డిల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అత్యంత రక్షణాత్మక హెడ్జింగ్‌ సాధనంగా బంగారం కొనసాగుతుంది. నిన్నటిరోజున బంగారం 3శాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని మనం గమనించవచ్చు. రానున్న రోజుల్లో మరింత బంగారానికి మరింత డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

గ్లాస్‌రాట్నర్ అడ్వైజరీ సంస్థ ప్రతినిధి సేథ్ ఆర్ ఫ్రీమాన్ మాట్లాడుతూ ‘స్టీరియోటైపికల్’ అనిశ్చితి కారణంగా ఇటీవలి జరిగిన పరిణామాలు వర్థమాన దేశాల మార్కెట్లకు ప్రతికూలంగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సాహసం చేయరని ఆయన అభిప్రాయపడ్డారు

ఆసియా ఈక్విటీలకు సంబంధించి, ఇండెక్స్ ఫండ్స్ చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థిక బలమైన దేశంగా ఉన్న చైనా లాంటి ఆసియా దేశం ఎక్స్‌పోజర్స్‌ కారణంగా ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టర్లు వెనకడుగు చేస్తుంటే, ఆ ఫండ్‌లోని ఇతర ఆసియా దేశాలు కూడా దెబ్బతింటాయి. దాదాపు ఇలాంటి పరిస్థితే ఇతర వర్థమాన దేశాల్లో జరుగుతుందని ఫ్రీమెన్‌ తెలిపారు.

అయితే అమెరికా ఈల్డ్స్‌ భారీగా పతనమైంది. ఇంత తక్కువ దిగుబడి ఉన్న పరిస్థితుల్లో ప్రొఫెనషల్‌​ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లో చెందుతున్న మార్కెట్లలో అధిక ఈల్డ్‌‍్స పొందే అవకాశాన్ని చూడవచ్చని ఆయన తెలిపారు. 

మరోవైపు ఈటీఎఫ్‌ ప్రవాహాలు మార్కెట్ దిశను నిర్దేశిస్తున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్ చెప్పారు. 



You may be interested

బంగారం రూ.44వేల పైకి..!

Thursday 5th March 2020

అంతర్జాతీయ పరుగు, రూపాయి బలహీనత నేపథ్యం ఒకవైపు అంతర్జాతీయంగా యల్లో మెటల్‌ పరుగు, మరోవైపు దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత, పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌ దేశంలో బంగారం ధరలకు రెక్కలను ఇస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్‌ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు  ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది. న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి

టాటామోటార్స్‌ షేరు 5% డౌన్‌

Wednesday 4th March 2020

బుధవారం టాటా మోటార్స్‌ షేరు 5 శాతానికి పతనమైంది. 2020 ఫిబ్రవరిలో 34.42 శాతం పడిపోయాయని కంపెనీ మంగళవారం ప్రకటించడంతో నేడు షేరు విలువ పడిపోయింది. కోవిడ్‌-19 ప్రభావంతో చైనానుంచి సరఫరా కావాల్సిన విడిభాగాలు ఆగిపోవడంతో టాటామోటార్స్‌ ఉత్పత్తి తగ్గిందని కంపెనీ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 56,826 యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 37,826కు పడిపోయింది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ఉత్పత్తి గతేడాదిలో 45.8 శాతంగా ఉంటే ఈ

Most from this category