News


ఆర్‌బీఐ ఏం చేస్తుందో!?

Thursday 6th February 2020
Markets_main1580962213.png-31547

నేడు సమీక్షా సమావేశ ఫలితాలు
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక సమీక్షా సమావేశం గురువారం ముగియనుంది. ఈ దఫా ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మీటింగ్‌లో మార్కెట్లు రేట్‌ కట్‌ ఆశల్లో ఉండగా, కమిటీ సభ్యులంతా రేట్లు యథాతధంగా ఉంచేందుకు ఓట్‌ చేశారు. ద్రవ్యోల్బణ గణాంకాలను నిశితంగా పరిశీలించాలని, తదుపరి రేట్‌కట్స్‌ను ధరల ఆధారంగా పరిశీలించాలని ఆర్‌బీఐ అప్పుడు భావించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు మార్పులు వచ్చాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి చైనా కరోనా వైరస్‌ ఎకానమీలను వణికిస్తోంది. ఇప్పటికైతే ప్రపంచ డిమాండ్‌ సరఫరాలపై వైరస్‌ ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయమై స్పష్టత లేదు. విత్త మార్కెట్ల భయాలు చల్లార్చడానికి చైనా పలు చర్యలు ప్రకటిస్తోంది. మరికొన్ని దేశాలు కూడా ఇదే ధోరణి అవలంబించే ఛాన్సులున్నాయి. దేశీయంగా నెలారంభంలో బడ్జెట్‌ వచ్చింది. ప్రస్తుత వచ్చే ఆర్థిక సంవత్సరాలకు విత్తమంత్రి విత్తలోటు అంచనాలను పెంచారు. మరోవైపు డిసెంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం పెరిగింది. కానీ తర్వాత ఉల్లిధరలు దిగిరావడంతో ఆహారపదార్ధాల ధరలు కొంతమేర తగ్గాయి. ప్రపంచ సెంటిమెంట్‌ దెబ్బతినడంతో కమోడిటీల ధరలు కూడా దిగివచ్చాయి. ఇవన్నీ గమనించి ఆర్‌బీఐ స్టేటస్‌కో మెయిన్‌టెయిన్‌ చేయవచ్చని నిపుణుల అంచనా. ప్రస్తుత పరిస్థితులను అబ్జర్వ్‌ చేస్తూ అవసరమైనప్పుడు కల్పించుకోవాలని ఆర్‌బీఐ భావించవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ దఫా మార్కెట్లను కెలికే ఆలోచన ఎంపీసీ చేయకపోవచ్చని అంచనా. మార్కెట్లు సైతం యథాతధ స్థితినే అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ భారీ సర్‌ప్రైజ్‌లకు ఛాన్సు ఇవ్వకపోవచ్చు. 


RBI

You may be interested

పెట్టుబడుల ఉపసంహరణకు ముందే ఆస్తుల విక్రయం

Thursday 6th February 2020

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు ముందే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి మిగులు భూములు ఏవైనా ఉంటే మార్కెట్‌ రేటుకు ఆయా రాష్ట్రాలు లేదా ప్రయివేటు పార్టీలకు విక్రయించనున్నట్టు కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని రాజ్యసభలో ఓ సభ్యుని ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌, ఆర్‌ఈసీ సహా 28 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర

ఏడేళ్ల గరిష్టానికి సేవల రంగం కార్యకలాపాలు

Thursday 6th February 2020

జనవరిలో 55.5కు చేరిక న్యూఢిల్లీ: భారత సేవల రంగం కార్యకలాపాలు జనవరి నెలలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ డిసెంబర్‌లో ఉన్న 53.3 పాయింట్ల నుంచి జనవరి నెలలో 55.5 పాయింట్లకు చేరుకుంది. జనవరి నెలలో నూతన ఆర్డర్ల రాకతో ఉపాధి కల్పన, వ్యాపార ఆశావహ, సానుకూల మార్కెట్‌ పరిస్థితులకు దోహదపడినట్టు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సంస్థ పేర్కొంది. నూతన ఆర్డర్ల రాక

Most from this category