News


ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల్లో 60 శాతం పెరుగుదల

Tuesday 25th June 2019
news_main1561439382.png-26553

న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల్లో ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 60 శాతం పెరిగి 8,582 మంది ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య 5,349 మంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారిని/సంస్థలను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఇటువంటి వారికి తాజా రుణాలను బ్యాంకులు అందించకపోవడంతోపాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 



You may be interested

కొత్త కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యం

Tuesday 25th June 2019

కొత్త కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యం ఐపీవో దీర్ఘకాలిక విధానంలో భాగం: ఫ్లిప్‌కార్ట్‌ న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం తమ దృష్టి అంతా 20-30 కోట్ల మంది భారతీయులను కొత్తగా ఈ -కామర్స్‌ వైపు తీసుకురావటంపైనే ఉందని స్పష్టంచేసింది. ఐపీవోకు రావడం అన్నది తమ ఆకాంక్ష అని, కంపెనీ దీర్ఘకాల వ్యూహంలో ఇది భాగమే అయినప్పటికీ ప్రస్తుతమైతే దీనికి కాలపరిమితి లేదని పేర్కొంది. 2022 నాటికి అమెరికా ఈక్విటీ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్‌

డీవీఆర్‌ షేర్లకు కొత్త నిబంధనలు !

Tuesday 25th June 2019

సెబీ కసరత్తు  న్యూఢిల్లీ: డిఫరెన్షియల్‌  ఓటింగ్‌ రైట్స్‌(డీవీఆర్‌) షేర్లకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. కంపెనీపై తమ నియంత్రణను కోల్పోకుండానే డీవీఆర్‌ షేర్ల జారీ ద్వారా ప్రస్తుతం ప్రమోటర్లు నిధులు సమీకరించుకోవచ్చు. డీవీఆర్‌ షేర్లు ఈక్విటీ షేర్లలాగానే ఉంటాయి. కానీ ఓటింగ్స్‌ రైట్స్‌ తక్కువగా ఉంటాయి. తమ కంపెనీ బలవంతపు టేకోవర్‌కు గురి కాకుండా ఉండటం కోసం సాధారణంగా ప్రమోటర్లు ఈ డీవీఆర్‌ షేర్లను

Most from this category