News


రేట్లు ఎందుకు తగ్గించలేదంటే...?

Thursday 5th December 2019
news_main1575535553.png-30074

ఆహార ధరల పెరుగుదలపై ఆందోళనలే వడ్డీరేట్ల తగ్గింపునకు అడ్డం పడ్డాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వివరించారు. ఆహార ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగిందని, దీంతో రేట్ల తగ్గింపు యోచన విరమించామని తెలిపారు. రాబోయే త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవలి గణాంకాలు సూచించాయన్నారు. అయితే కోర్‌ ద్రవ్యోల్బణం మాత్రం తమ టార్గెట్‌ 4 శాతం లోపే ఉండొచ్చన్నారు. ఆహార పదార్ధాల ధరలు తగ్గడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్న దాస్‌ టెలికం టారిఫ్‌ల పెంపుదల పరోక్షంగా ద్రవ్యోల్బణంపై పడుతుందన్నారు. ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణ కట్టడేనని గుర్తు చేశారు. భవిష్యత్‌లో రేట్‌ కట్‌కు అవకాశం ఉంటుందన్న ఆయన ఇందుకు ద్రవ్యోల్బణం దిగిరావాల్సిఉంటుందన్నారు. ప్రస్తుతం రేట్‌ కట్‌కు విరామం ఇచ్చామని, దీంతో ద్రవ్యోల్బణం ఎలా మారుతుందో చూడాలని చెప్పారు. ద్రవ్యోల్బణ రిస్కులే ఆర్‌బీఐ వరుసగా ఆరో రేట్‌కట్‌కు వెళ్లకుండా ఆపాయని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అమర్‌ ఆంబానీ చెప్పారు. భవిష్యత్‌లో వీలునుబట్టి రేట్‌కట్‌ చేస్తామని ఆర్‌బీఐ చెబుతున్నా, ద్రవ్యోల్బణ పరిస్థితులే దీన్ని డిసైడ్‌ చేస్తాయన్నారు.

మందగమన భయాలున్నందున రేట్లు తగ్గిస్తారన్న ఎక్కువమంది అంచనాలకు భిన్నంగా ఎంపీసీ రేట్లను యథాతధంగా ఉంచి ఆశ్చర్యపరిచిందని కోటక్‌ లైఫ్‌ఇన్స్యూరెన్స్‌ ప్రతినిధి సుధాకర్‌ షాన్‌బాగ్‌ చెప్పారు. మాంద్య భయాల కన్నా ద్రవ్యోల్బణ నిర్వహణపైనే ఆర్‌బీఐ ఎక్కువ శ్రద్ధపెట్టాలని నిర్ణయించుకుందన్నారు. తమ లక్ష్యాల కన్నా ప్రస్తుత, రాబోయే కాలాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువుంటుందని ఆర్‌బీఐ భావించిందన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన రేట్ల కోతలు వృద్ధి మెరుగుదలకు సాయపడతాయని ఆర్‌బీఐ ఆలోచించినట్లు వివరించారు. 



You may be interested

రిలయన్స్‌ టార్గెట్‌ పెంచిన గోల్డ్‌మేన్‌ శాక్స్‌

Thursday 5th December 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మేన్‌ శాక్స్‌ దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను పెంచింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరపు ఆదాయాలను కూడా పెంచింది. ఇటీవల కాల్‌, డేటాలపై పెంచిన టారీఫ్‌లతో యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌(ఏఆర్‌పీయూ) వృద్ది చెందే అవకాశం ఉంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి సబ్‌స్క్రైబర్లు వలస రావడంతో పాటు జియో నెట్‌వర్క్‌కు ఉండే బలమైన సబ్‌స్ర్కిబ్షన్‌ కూడా మూమెంట్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

నష్టాల్లోకి బ్యాంకింగ్‌ రంగ షేర్లు

Thursday 5th December 2019

ఆర్‌బీఐ నిర్ణయం మార్కెట్‌ అంచనాలను ప్రతికూలంగా ఉండంటంతో సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లింది. ఆర్‌బీఐ నేడు కీలకమైన పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈసారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రేటు 4.90 వద్ద, బ్యాంక్‌ రేటు 5.40శాతం వద్ద కొనసాగుంది. అర్‌బీఐ అనూహ్య పరిణామంతో వడ్డీరేట్లపై ప్రత్యక్ష సంబంధం ఉన్న బ్యాంకింగ్‌ రంగ

Most from this category