News


అష్టలక్ష్మి గ్రామోస్తుతే..

Saturday 6th July 2019
news_main1562393981.png-26844

కేంద్ర బడ్జెట్‌ ‍ప్రవేశపెట్టిన రెండో మహిళా మంత్రిగా రికార్డుల కెక్కిన నిర్మలా సీతారామన్‌.. ఓ మహిళగా, ఓ సాధారణ కుటుంబం వచ్చిన మహిళగా.. కేంద్ర మంత్రిగా ఆలోచించారు. సొంతింటి కలనుంచి.. దేశ రక్షణ వరకు తనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట
ఒక మహిళగా.. అదీ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్‌కు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడే ఇబ్బందులు బాగా తెలుసు. అందుకే మహిళా సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో సరిపోయేటన్ని నిధులు కేటాయించారు. ఖాతాలో డబ్బుల్లేకుండా మహిళలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాల్లో జన్‌ధన్‌ ఖాతాలున్న వారందరికీ.. రూ.5వేల ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ) ఇస్తామని ప్రకటించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ఒకరికి ముద్ర లోన్‌ కింద లక్ష రూపాయల రుణం ఇస్తామన్నారు. 

ఎల్‌ఈడీతో వెలుగు జిలుగులు
విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతుండడంతో దీనిపై వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎల్‌ఈడీలను పంపిణీ చేసింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇంటి వెలుగులు పెరగడంతోపాటు కరెంటు బిల్లు తగ్గించేందుకు 143కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీచేయనున్నట్లు ఆమె తెలిపారు. దీంతోపాటు సౌరవిద్యుత్‌ వినియోగాన్ని పెంచేందుకు సోలార్‌ స్టవ్‌లు, సోలార్‌ బ్యాటరీలను తక్కువ మొత్తానికి విక్రయించనున్నట్లు వెల్లడించారు. 

మా‘ఇంటి’ మాలక్ష్మి
మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు కలే. అలాంటి కలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నెరవేర్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి నిర్మల మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పథకం కింద 81 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 26 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు.

దేశ ‘రక్షణ’కు సింహభాగం
మాజీ రక్షణశాఖ మంత్రిగా ఆ శాఖకు జరగాల్సిన కేటాయింపులపైనా నిర్మల వెనక్కు తగ్గలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చేసిన రూ.3.18లక్షల కోట్ల కేటాయింపులనే కొనసాగించారు. పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేస్తున్న అధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలు, ఇతర మిలటరీ పరికరాలు కొనుగోలు చేసేందుకు భారీ మొత్తాన్నే వినియోగించనున్నారు. 

ఆయుష్మాన్‌ భవ
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైద్య సమస్యలే పతాక శీర్షికల్లో కనబడుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు మందు రాసేందుకు నిర్మల నడుంబిగించారు. పేద, మధ్య తరగతికి ప్రాణవాయువైన ఆయుష్మాన్‌ భారత్‌పై ప్రత్యేక దృష్టిపెడుతూనే.. మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునీకరణతోపాటు.. వైద్య విద్యను పటిష్టం చేసే దిశగా అడుగులేశారు. గత రెండు బడ్జెట్‌లతో పొలిస్తే.. వైద్య రంగానికి నిధులను గణనీయంగా పెంచారు. దీంతోపాటుగా సాంప్రదాయ వైద్యానికీ సరైన ప్రాధాన్యతనిచ్చారు. 

ప్రపంచస్థాయికి మన విద్య
వివిధ రంగాల్లో నైపుణ్యత లేమి కారణంగా వస్తున్న సమస్యలకు విద్యారంగంలో ఉన్న అడ్డంకులే కారణమని గుర్తించిన నిర్మలా సీతారామన్‌.. పాఠశాల విద్యనుంచే మార్పులు తప్పవని నిర్ణయించారు. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిశోధనలు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేలా.. నైపుణ్యతతో కూడిన విద్యకు ప్రోత్సాహాన్నిందిచేలా కేటాయింపులు చేశారు. క్రీడలకూ సమాన ప్రాధాన్యమిచ్చేలా ఖేలో ఇండియాకు కేటాయింపులు పెంచారు.

రైతే రాజుగా నిలిచేలా
యూపీఏ హయాంలో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు పడిన కష్టం నిర్మలకు తెలుసు. గత ఐదేళ్లుగా దేశం ఈ పరిస్థితిని అధిగమించి.. ధాన్యాన్ని ఎగుమతి చేసుకునే పరిస్థితికి వెళ్లడం వెనక రైతు సేవ గొప్పదని పార్లమెంటు సాక్షిగా ప్రశంసించారు. అందుకే రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు.. అన్ని రకాలుగా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు భారీగా వరాలు కురిపించారు. దీంతోపాటు వ్యవసాయాధారిత రంగాలను ప్రోత్సహించేలా నిధులు కేటాయించారు.

ఆడదాన్నే.. కానీ!
ఆడవారికి బంగారమంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. నిర్మలా సీతారామన్‌కు కూడా మహిళగా వారి ఆసక్తులు తెలుసు. కానీ బంగారంపై 2.5% దిగుమతి సుంకం పెంచడం వెనక కూడా బలమైన కారణమే ఉంది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆమె ముందుకెళ్లారు. దిగుమతిపై వెచ్చించే వ్యయం తగ్గి తద్వారా లోటు తగ్గుతుంది. ఈ విషయంలో ఓ మహిళగా కంటే.. మంత్రిగా చేయాల్సింది అదే.
సుంకం పెంచడం ద్వారా బంగారం వినియోగం కాస్త తగ్గుతుందని.. 



You may be interested

పరిశోధనల పాఠశాల

Saturday 6th July 2019

నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన విద్యా రంగానికి రూ. 94,853.64 కోట్లు కేటాయింపు ప్రపంచస్థాయి విద్యాసంస్థల కోసం రూ. 400 కోట్లు త్వరలో కేంద్ర ఉన్నత విద్యా కమిషన్‌ ముసాయిదా బిల్లు విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ‘స్టడీ ఇన్‌ ఇండియా’ పథకం గాంధీజీ సిద్ధాంతాలపై యువతలో అవగాహనకు గాంధీపీడియా న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

పెట్రోల్‌, బంగారం మరింత ప్రియం

Saturday 6th July 2019

-పొగాకు ఉత్పత్తులు, విదేశీ కార్లు, ఏసీ, జీడిపప్పు ధరలు పైపైకి -తగ్గనున్న ‘ఎలక్ట్రిక్‌’ విడి భాగాలు, కెమెరా పరికరాల ధరలు -ఫోన్‌ చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సులు తక్కువ ధరలకే.. ఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ఇటు సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఏసీల ధరలు సైతం అధికమవనున్నాయి. పన్నులు పెరుగుతుండటంతో వీటి ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌

Most from this category