News


ఎల్‌టీఆర్‌ఓతో ఏంటి ప్రయోజనం??

Friday 7th February 2020
news_main1581051646.png-31589

ద్రవ్యపరపతి విధానాలు మరింత మెరుగ్గా దిగువ రంగాలకు బదిలీ అయ్యేందుకు ఆర్‌బీఐ గురువారం ఎల్‌టీఆర్‌ఓ(లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్‌)ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌టీఆర్‌ఓఎలా ప్రభావం చూపుతుంది? చూద్దాం...
= ఆర్‌బీఐ ఒకేడాది, మూడేళ్ల కాలపరిమితితో రూ. లక్ష కోట్ల వరకు ఉండే టర్మ్‌ రెపోలను పాలసీ రెపో రేట్‌ వద్ద నిర్వహిస్తామని ప్రకటించింది. దీన్నే ఎల్‌టీఆర్‌ఓ అంటారు.
= బ్యాంకులకు సరైన లిక్విడిటీ, సరైన రేట్ల వద్ద అందించేందుకు, బ్యాంకులు వడ్డీరేట్ల తరుగుదలను సాఫీగా, నిరంతరంగా కస్టమర్లకు, ఉత్పాదక రంగాలకు బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ ఈ ఎల్‌టీఆర్‌ఓ ప్రవేశపెట్టింది.
= ఫిబ్రవరి 15 నుంచి పాలసీరేట్‌ వద్ద ఈ ఎల్‌టీఆర్‌ఓను నిర్వహిస్తామని ఆర్‌బీఐ తెలిపింది.
= దీనితో స్వల్పకాలిక వడ్డీరేట్లు తగ్గడంతో పాటు కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులు పెరుగుతాయి. ఇప్పటికే ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ట్విస్ట్‌తో కలిసి ఈ కొత్త విధానాలు రేట్‌ కట్‌ బదిలీ సాఫీగా జరిగేందుకు, బాండ్‌ఈల్డ్స్‌ను మేనేజ్‌ చేసేందుకు సహకరిస్తాయి.
= ఈ విధానాన్ని ప్రకటించగానే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ ఒక్కమారుగా పతనమయ్యాయి.
= ఇది ఆర్‌బీఐ తీసుకున్న గట్టి చర్యని, దీనివల్ల రేట్లు తగ్గడంతో పాటు బాండ్‌ఈల్డ్స్‌ కూడా దిగివస్తాయని ప్రముఖ బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Friday 7th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు యస్‌ బ్యాంక్‌:  ప్రవేటు రంగ రుణదాత యస్‌బ్యాంక్‌ శుక్రవారం ముంబైలో ఈజీఎంను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో అధీకృత మూలధనాన్ని రూ.800 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచడం, మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌ క్లాజ్‌ -5లో సవరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఐడీఎఫ్‌సీ: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో ఐడీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.342.67 కోట్లుగా నమోదైందని ఐడీఎఫ్‌సీ తెలిపింది. కాగా క్రితం ఆర్థిక

బడా ఎంఎన్‌సీల డివిడెండ్ల జాతర!

Friday 7th February 2020

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఎంఎన్‌సీల్లో డివిడెండ్ల చెల్లింపుపరంగా టాప్‌ 25లో నిలిచే ఎంఎన్‌సీలకు తాజాగా బడ్జెట్లో డీడీటీ ఎత్తివేయడంతో సుమారు రూ. 2800 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, నెస్లె, కాల్‌గేట్‌ పామోలివ్‌ తదితర బడా ఎంఎన్‌సీలకు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ మినహాయింపుతో భారీ ప్రయోజనం చేకూరుతుందని, ఇలా మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ల రూపంలో చెల్లించడం లేదా తమ విదేశీ మాతృసంస్థలకు బదిలీ

Most from this category