News


భారత్‌తో వాణిజ్యం.. చైనాను దాటేసిన అమెరికా

Monday 24th February 2020
news_main1582513059.png-32023

న్యూఢిల్లీ: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో చైనాను వెనక్కి నెట్టేసి అమెరికా మరింత ముందుకు వచ్చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2018-19లో అమెరికాతో భారత ‍ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందింది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019-20లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు చూసుకున్నా.. అమెరికా-భారత్‌ మధ్య 68 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇదే కాలంలో చైనాతో వాణిజ్యం 64.96 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. అమెరికా- భారత్‌ తమ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండడంతో, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అమెరికా-భారత్‌ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) వస్తే అప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. మనదేశ వస్తు సేవలకు అమెరికా పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఎఫ్‌టీఏ మనకే ఎక్కువ ప్రయోజనకరమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ పేర్కొన్నారు. 2018-19లో అమెరికాతో మన దేశానికి వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, చైనాతో 53.56 బిలియన్‌ డాలర్ల లోటు ఉండడం గమనార్హం. 



You may be interested

ఈ వారం స్టాక్‌ సిఫార్సులు

Monday 24th February 2020

శ్రీ సిమెంట్స్‌ :    కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.24,367 టార్గెట్‌ ధర: రూ.27,900 ఎందుకంటే: శ్రీ సిమెంట్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. విద్యుత్తు విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో మొత్తం ఆదాయం 2 శాతమే వృద్ధి చెంది రూ.2,848 కోట్లకు పెరిగింది. సిమెంట్‌ అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధితో 6.25 మిలియన్‌ టన్నులకు చేరాయి. రియలైజేషన్లు ఒక్కో టన్నుకు రూ.4,508గా

త్వరలోనే టీహెచ్‌డీసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌

Monday 24th February 2020

న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్ కార్పొరేషన్ (నీప్‌కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీకి ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది

Most from this category