News


వ్యవసాయంలో ఎగుమతులపై దృష్టి

Friday 11th January 2019
news_main1547186579.png-23529

న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.   వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్‌ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్‌ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్‌-చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.



You may be interested

దేశంలో జల రవాణా విప్లవం

Friday 11th January 2019

న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్‌ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్‌) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల

బంధన్‌ బ్యాంక్‌ లాభం 10శాతం అప్‌

Friday 11th January 2019

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్రభావం ఈ బ్యాంక్‌పై కూడా 10.3 శాతానికి చేరిన నికర వడ్డీ మార్జిన్‌ పెరిగిన స్థూల మొండి బకాయిలు న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ బ్యాంక్‌ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌

Most from this category