News


స్టార్టప్‌లకు జోష్‌

Sunday 2nd February 2020
news_main1580616551.png-31419

  • ఎసాప్స్‌పై అయిదేళ్ల ట్యాక్స్‌ హాలిడే
  • రూ. 100 కోట్లలోపు టర్నోవరున్న సంస్థలకూ పన్ను ప్రయోజనాలు

న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఎసాప్స్‌)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించారు. "ఎసాప్స్‌కి సంబంధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుండా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా (ఏది ముందైతే అది) ట్యాక్స్‌ హాలిడే వర్తిస్తుంది" అని మంత్రి పేర్కొన్నారు. శైశవ దశలో ఉన్న స్టార్టప్‌ సంస్థలు నిపుణులైన సిబ్బందిని ఆకర్షించేందుకు, సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోకుండా అట్టే పెట్టుకునేందుకు ఈ ఎసాప్స్‌ ఉపయోగపడతాయి. మరోవైపు, లాభాలపై పన్ను మినహాయింపులను పొందేందుకు సంబంధించి కంపెనీల టర్నోవరు పరిమితిని రూ. 25 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచారు. డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే వ్యవధిని కూడా ఏడేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించారు. అలాగే, అంకుర సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు సీడ్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశ ఎకానమీకి స్టార్టప్‌లు చోదకాలుగా ఉంటున్నాయని, వాటి వృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

స్టార్టప్‌ల హర్షం...
బడ్జెట్‌ ప్రతిపాదనలపై స్టార్టప్‌ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఎసాప్స్, ట్యాక్సేషన్, సీడ్‌ ఫండ్‌ తదితర చర్యలు అంకుర సంస్థలకు గణనీయంగా ఉత్సాహం ఇవ్వగలవని ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ సౌరభ్‌ శ్రీవాస్తవ తెలిపారు. పన్నులపరమైన వేధింపులు ఉండబోవన్న హామీ.. ఎంట్రప్రెన్యూర్స్‌కు మరింత ధీమానిస్తుందని చెప్పారు. అన్ని దశల్లోనూ తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయడం వల్ల స్టార్టప్‌లు తమ వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టగలవని వెంచర్‌ క్యాటలిస్ట్స్‌ సహ వ్యవస్థాపకుడు అనుజ్‌ గొలేచా తెలిపారు. You may be interested

ఒక ప్రధాన పోర్ట్‌నైనా కార్పొరేటీకరిస్తాం

Sunday 2nd February 2020

ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తాం లోథాల్‌లో మారిటైమ్‌ మ్యూజియమ్‌ ఏర్పాటు  బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్‌  న్యూఢిల్లీ: పోర్టుల పనితీరును మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ఒక ​ప్రధాన పోర్ట్‌ను అయినా కార్పొరేటీకరణ చేయాలని, ఆ తర్వాత దానిని స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రతిపాదించారు. యాంత్రీకీకరణ, డిజిటైజేషన్‌, సరళతరమైన విధానాలు అవలంభించడం తదితర

మోదీ సర్కారు ‘వృద్ధి’ మంత్రం!

Sunday 2nd February 2020

ఇటు వేతనజీవులు అటు కార్పొరేట్లను మెప్పించే తంత్రం వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబుల్లో భారీ మార్పులు కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను పూర్తిగా తొలగింపు.... పడిపోతున్న వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా వ్యయాన్ని పెంచాలని నిర్ణయం రాబడులు తగ్గడంతో ద్రవ్యలోటు అదుపుతప్పినా వెరవని వైనం ప్రభుత్వ ఖజానాకు చిల్లు.. ‘ఎల్‌ఐసీ’తో చెల్లు.. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి సై తద్వారా పెద్దమొత్తంలో నిధుల సమీకరణకు ప్రణాళిక... వ్యవసాయం, మౌలికవసతుల రంగాలకు భారీగా కేటాయింపులు రైల్వేల్లో మరింతగా ‘ప్రైవేటు’ కూతకు పచ్చజెండా విద్య, వైద్యంలో

Most from this category