News


ఎర్నింగ్స్‌ వృద్ధిపై యూబీఎస్‌ బుల్లిష్‌

Wednesday 22nd January 2020
news_main1579686640.png-31104

విదేశీ నిధుల సహకారంతో 2021 డిసెంబర్‌ నాటికి నిఫ్టీలో 20 శాతం అప్‌మూవ్‌(బేస్‌ కేస్‌) ఉంటుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అంచనా వేసింది. ఐదేళ్ల తర్వాత నిఫ్టీ ఎర్నింగ్స్‌పై బుల్లిష్‌గా మారినట్లు తెలిపింది. ఎగుమతులు, విధాన నిర్ణయాలు, మూలధన వ్యయాలు, క్రెడిట్‌ గ్రోత్‌ అనే నాలుగు పారామీటర్ల ఆధారంగా ఎర్నింగ్స్‌పై బుల్లిష్‌గా మారామని తెలిపింది. ఇండియా ఏడేళ్ల నిరుత్సాహం తర్వాత వృద్ధి పరంగా సంధి కాలానికి చేరిందని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నా దీర్ఘకాలంగా భారత్‌ తన శక్తికి తగిన ప్రదర్శన చూపలేదని పేర్కొంది. వచ్చే మూడేళ్ల పాటు నిఫ్టీ ఎర్నింగ్స్‌ 15 శాతం చొప్పున పెరగవచ్చని అంచనా వేసింది. ఈ వృద్ధి పరుగును ఇంకా మార్కెట్‌ డిస్కౌంట్‌ చేయలేదని తెలిపింది. ముఖ్యంగా ఎగుమతుల పరంగా భారత్‌కు మంచి అవకాశాలున్నాయని పేర్కొంది. బ్యాంకింగ్‌ వ్యవస్థకు మరమ్మత్తులు జరగడంతో క్రెడిట్‌ సైకిల్‌ మెరుగుపడుతుందని పేర్కొంది. 2021- 23 మధ్య కాలంలో పైన పేర్కొన్న నాలుగు అంశాలు కలిసి జీడీపీని 6.4 శాతం వరకు తీసుకుపోతాయని అంచనా వేసింది. ఇందుకు రూపాయి, వడ్డీరేట్లు కూడా సహకరిస్తాయని పేర్కొంది. 
ఎఫ్‌పీఐల ఐదేళ్ల సరాసరి కన్నా అధిక ఎఫ్‌పీఐలు ఇకపై వస్తాయని, వార్షికంగా ఇండియాలోకి ఇకపై దాదాపు 2500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు రావచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో దేశీయ ఈక్విటీ ఎంఎఫ్‌లు ఏయూఎంలు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేసింది. గతంలో వచ్చిన సంస్కరణలు వృద్దిని చికాకుపెట్టేరకమని(జీఎస్‌టీ, బ్యాంకింగ్‌ ప్రక్షాళన తదితరాలు), కానీ తాజా సంస్కరణలు(కార్పొరేట్‌ టాక్స్‌ కోత, లేబర్‌ సంస్కరణలు, ప్రైవేటేజేషన్‌) వృద్ధిని ముందుకు తీసుకుపోయేవని తెలిపింది. ఇదే సమయంలో కొన్ని రిస్కులు కూడా ఉంటాయని యూబీఎస్‌ హెచ్చరించింది. బ్యాంకింగ్‌లో ఇంకా కొన్ని రిస్కులు మిగిలుండడం, అంతర్జాతీయ పరిణామాలు పైన పేర్కొన్న వృద్ధి అంచనాలకు రిస్కులని తెలిపింది. ఇలాంటివి ఎదురైతే నిఫ్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 7 శాతం, జీడీపీ 5 శాతం దిగువన మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టీ 2022 మార్చినాటికి ఇప్పుడున్న స్థాయిల నుంచి 20 శాతం డౌన్‌సైడ్‌ను చూస్తుందని తెలిపింది. ఇందుకు విదేశీ నిధుల ఉపసంహరణ దోహదం చేయవచ్చని వివరించింది. 



You may be interested

సెన్సెక్స్‌ 208 పాయింట్లు డౌన్‌

Wednesday 22nd January 2020

63 పాయిం‍ట్లు క్షీణించిన నిఫ్టీ బడ్జెట్‌పై అంచనాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో నష్టాలతో ముగిశాయియి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు కోల్పోయి 41,115 వద్ద నిలవగా.. నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 12,107 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 42,532 వద్ద సెన్సెక్స్‌, 12,225 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. తదుపరి

మయూర్‌, హాట్సన్‌ అప్‌- హావెల్స్‌, తేజాస్‌ డౌన్‌

Wednesday 22nd January 2020

బడ్జెట్‌పై అంచనాలతో హుషారుగా ప్రారం‍భమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. మధ్యాహ్నం 2.45కల్లా సెన్సెక్స్‌ 228 పాయింట్లు పతనమై 41,096కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 12,201 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా మయూర్‌ యూనికోటర్స్‌, హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తుంటే.. మరోపక్క హావెల్స్‌ ఇండియా, తేజాస్‌ నెట్‌వర్క్స్‌

Most from this category