News


వృద్ధికి చర్యలు లోపించాయి

Friday 20th September 2019
news_main1568951399.png-28441

  • దానిపైనే పనిచేస్తున్నా.. చూస్తున్నారుగా..?
  • ట్విట్టర్‌పై కిరణ్‌ మజుందార్‌, ఆర్థిక మంత్రి సంవాదన

న్యూఢిల్లీ: ట్విట్టర్‌ వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వృద్ధికి మద్దతునిచ్చే చర్యలు లోపించాయంటూ షా విమర్శించారు. ట్విట్టర్‌పై విమర్శలకు సహజంగా బదులివ్వని నిర్మలా సీతారామన్‌.. షా విమర్శలకు మాత్రం స్పందించారు. ‘‘మీరు గమనించే ఉంటారు ఆర్థిక మంత్రిగా నేను ఆ పనే చేస్తున్నాను. ఆర్థిక రంగానికి సంబంధించి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నాను’’ అని సీతారామన్‌ ట్వీటిచ్చారు. ముఖ్యంగా బుధవారం సీతారామన్‌ మీడియా సమావేశం పెట్టి ఈ సిగరెట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఆమేమీ వైద్య మం‍త్రి కాదుగా అన్నది ఆమె ఆశ్చర్యం. ‘‘ఈ సిగరెట్లను నిషేధించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. ఇది వైద్య మంత్రిత్వ శాఖ నుంచి రాలేదు? గుట్కా నిషేధం గురించి ఏమిటి? ఆర్థిక రంగ పునరుద్ధరణకు కావాల్సిన చర్యలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటనలు ఏవి?’’ అని షా ట్వీట్‌ చేశారు. దీనికి సీతారామన్‌ స్పందిస్తూ... మంత్రుల బృందానికి అధిపతిగా తాను బుధవారం మీడియా సమావేశం నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు. ‘‘కిరణ్‌ జీ, కొన్ని అంశాలు. ఈ మీడియా సమావేశం క్యాబినెట్‌ నిర్ణయాల వెల్లడికి సంబంధించి నిర్ణయించినది. గ్రూపు ఆఫ్‌ మినిస్టర్స్‌ చైర్‌ హోదాలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పే మొదలుపెట్టాను’’ అని సీతారామన్‌ చెప్పారు. వైద్య మంత్రి హర్షవర్దన్‌ విదేశీ పర్యటనలో ఉన్నట్టు తెలిపారు. 



You may be interested

లాభంతో ప్రారంభమైన మార్కెట్‌..!

Friday 20th September 2019

కిత్రం రోజు భారీ నష్టంతో ముగిసిన దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 152 పాయింట్లు పోలిస్తే 36,215 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10,746.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌, ఫార్మా, రియల్టీ రంగ షేర్ల పతనంలో సూచీల లాభాలు హరించుకుపోయాయి. ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ 70 పాయింట్లు పెరిగి 36,163.53 వద్ద నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10,715 వద్ద

ఎంఎస్‌ఎంఈలలకు కేంద్రం వరం!

Friday 20th September 2019

2020 మార్చి వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దు ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచనలు వచ్చే నెల దేశవ్యాప్తంగా రుణ మేళాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. వాటి రుణాల పునరుద్ధరణపై పనిచేయాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Most from this category