News


2018-2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

Wednesday 24th July 2019
news_main1563951327.png-27276

న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2019-2020 అసెస్‌మెంట్‌ ఇయర్‌) వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్‌) దాఖలుకు గడవును కేంద్రం నెలపాటు పొడిగించింది. నిజానికి అకౌంట్ల ఆడిటింగ్‌ అవసరంలేని వేతన జీవులు, సంస్థలుసహా వ్యక్తిగత ఐటీఆర్‌ దాఖలుకు  గడువు 2019 జూలై 31తో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆయా వర్గాలకు కొంత వెసులుబాటు లక్ష్యంగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌) రిటర్న్‌ దాఖలు గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ల్ ఖాతాల్లో అవకతవకలు

Wednesday 24th July 2019

ఆడిటర్ల వెల్లడి న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతాల్లో లొసుగులు ఉన్నాయంటూ ఆడిటింగ్ సంస్థలు వెల్లడించాయి. అలాగే కొన్ని రుణాల మంజూరులోనూ అవకతవకలు జరిగాయని పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసిన డెలాయిట్ హాస్కిన్ అండ్ సెల్స్‌, చతుర్వేది అండ్ షా సంస్థలు ఈ మేరకు నివేదికలను స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించాయి. "ఆర్థిక ఫలితాలపై అభిప్రాయాలు తెలపడానికి ఆడిట్‌పరంగా తగిన ఆధారాలేమీ లభించలేదు"

దేశీయ డిమాండ్‌ బలహీనం!

Wednesday 24th July 2019

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై  ఐఎంఎఫ్‌ విశ్లేషణ 2019, 2020 వృద్ధి రేట్ల  అంచనాలు 0.3 శాతం కోత ఈ రెండేళ్లలో వృద్ధి 7, 7.2 శాతాలు మాత్రమే అంతర్జాతీయంగానూ వృద్ధి అంతంతే వాషింగ్టన్‌: భారత్‌ దేశీయ వినియోగ డిమాండ్‌ అవుట్‌లుక్‌​అంచనాలకన్నా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ కారణంగా 2019, 2020కి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.3 శాతం (30

Most from this category