News


2019 బిజినెస్‌ రివైండ్‌: రియల్టీ అంతంతమాత్రం..

Monday 30th December 2019
news_main1577679064.png-30517

రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్‌ 7 నగరాల్లో రిటైల్‌ లీజింగ్‌ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్‌ చ.అ. లీజింగ్‌ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్‌ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్‌మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్‌ తగ్గగా.. ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్‌ లీజింగ్‌ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి.  



You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: స్థిరంగా బీమా రంగం..

Monday 30th December 2019

బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్‌ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15 శాతం వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు,

2019 బిజినెస్‌ రివైండ్‌: ఎకానమీ అస్తవ్యస్తం..

Monday 30th December 2019

అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్‌ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్‌ కోల్పోయింది. సెప్టెంబర్‌ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు

Most from this category