News


2019 బిజినెస్‌ రివైండ్‌: ఎకానమీ అస్తవ్యస్తం..

Monday 30th December 2019
news_main1577678872.png-30516

అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్‌ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్‌ కోల్పోయింది. సెప్టెంబర్‌ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్‌వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోత వల్ల సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్‌ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్‌ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: రియల్టీ అంతంతమాత్రం..

Monday 30th December 2019

రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్‌ 7 నగరాల్లో రిటైల్‌ లీజింగ్‌ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్‌ చ.అ. లీజింగ్‌ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్‌ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్‌మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్‌ తగ్గగా.. ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్, సినిమా, సౌందర్య

2019 బిజినెస్‌ రివైండ్‌: బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సవాళ్లమయం

Monday 30th December 2019

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దివాలా ప్రభావాలతో 2019 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్‌ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్‌ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్‌ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా

Most from this category