STOCKS

News


ప్రధాన ఆర్థిక ఉద్దీపన వుండదు: ఎకనామిక్‌ అడ్వజర్‌

Thursday 22nd August 2019
news_main1566466736.png-27951

ఆర్థిక వ్యవస్థ కోసం, ప్రభుత్వం ప్రధాన ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ గురువారం తోసిపుచ్చారు. ‘లాభం ప్రైవేట్, నష్టాలు పబ్లిక్’ అనే సిద్థాంతం ఆర్థికవ్యవస్థకు మంచిది కాదని ఆయన అన్నారు. పరిశ్రమలకు సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి దశలు సాధారణమని, సూర్యాస్తమయ దశలలో పరిశ్రమలకు, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశించడం నైతికంగా ప్రమాదకరమని వివరించారు. హీరో మైండ్‌మైన్ సమ్మిట్ 2019 లో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ కొంత మందగమనంలో ఉన్నప్పటికి ఇండియా ఇప్పటికి కూడా, కేవలం 2-2.5 శాతం వృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఒక దృవతార అని అన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇప్పటికి చేయదాటనప్పటకి ‘మాంద్యం’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారని సమ్మిట్‌లో పాల్గొన్న ప్యానలిస్టులు అంగీకరించారు. దేశియంగా ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించాలంటే ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోని చేయాలని సూచించారు. తీవ్ర నిరాశవాదం లేదా అహేతుకమైన ఆశావాదం రెండూ కూడా మంచిది కాదని, ఇలాంటి వాటికి సంబంధించిన కథల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాకుండా ‘లాభం ప్రైవేట్, నష్టాలు పబ్లిక్’ అనే విధానం ఆర్థిక వ్యవస్థకు చేటని వివరించారు. ఆటో రంగం సంక్షోభంలో ఉండడానికి, ఆర్థిక వ్యవస్థ కారణం కానవసరం లేదని అన్నారు. 
   ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లడం లేదని మాజీ ఫైనాన్స్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ప్రస్తుత విద్యుత్‌ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ అన్నారు. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు గత మూడునాలుగేళ్ల సగటు కంటే అధికంగా ఉందని, మనం కూడా మందగమనాన్ని అధిగమిస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి, కార్పోరేట్‌ లాభాలు, పన్ను సేకరణలో మంచి ప్రదర్శన చేశామని, ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇతర కారణాలు, ఎన్నికలు వంటి అంశాల వలన ఆర్థిక మందగమనం ఉందని తెలిపారు. ‘సాధారణంగా జులై-సెప్టెంబర్‌ క్యార్టర్‌లో ‘మందగమనం’ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అలానే ఉంది’ అని గార్గ్‌ అన్నారు. అంతేకాకుండా ఎటువంటి ఉద్దీపనమైనా ప్రభుత్వంపై భారాన్ని పెంచుతుందని, ఫలితంగా ఆర్‌బీఐ రేట్ల కోత బదిలి నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.You may be interested

యస్‌బ్యాంక్‌.. రూ.47వరకు పడే ఛాన్స్‌?!

Thursday 22nd August 2019

టెక్నికల్‌ అనలిస్టుల అంచనా గురువారం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంక్‌ షేరు దాదాపు 8 శాతం పతనమయ్యాయి. దీంతో షేరు 2014 మార్చి తర్వాత కనిష్ఠాలకు వచ్చింది. ఇప్పటి పతనం అనంతరం షేరు కోలుకుంటుందని కొనుగోలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు కొంత కాలం ఆగడం మంచిదని టెక్నికల్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. షేరులో పతనం మరో లెగ్‌ ఆరంభమైందని, అందువల్ల షేరు మరో 20- 23 శాతం క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. టెక్నికల్‌ చార్టులు పరిశీలిస్తే

వేదాంత 10 శాతం పతనం ..!

Thursday 22nd August 2019

వరుసగా ఐదోరోజూ కూడా వేదాంత షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో మరో 10శాతం క్రాష్‌ అయ్యాయి. దేశీయంగా ఆర్థికవృద్ధి మందగమనంతో పాటు ట్రేడ్‌వార్‌తో చైనాలో స్టీల్‌ నిల్వలు పెరగడటంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా కంపెనీల ఆదాయాలను, నికర లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మెటల్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగా వేదాంత షేర్లు సైతం భారీగా

Most from this category