STOCKS

News


ఆర్థిక వ్యవస్థకు ఉద్ధీపనం!

Wednesday 14th August 2019
news_main1565757223.png-27746

ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి బయటపడేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. . కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలను సిద్ధంచేస్తున్నారని అన్నారు. ఇందులో పన్నులను తగ్గించడం, సబ్సీడీలివ్వడం, ఇతర ప్రోత్సాహాకాలందించడం వంటి పరిశ్రమల వృద్ధికి సంబంధించిన చర్యలే కాకుండా వ్యాపారాలను సులభతరం చేసుకునే విధంగా పలు చర్యలు తీసుకోనున్నారని వివరించారు.  నిజాయితీగా పన్నులను చెల్లించే వాళ్లను వేధించకుండా,  చిన్న లేదా విధానపరమైన ఉల్లంఘనలకు పాల్పడేవారు అధిక చర్యలకు గురికాకుండా ఉండేలా, రెవెన్యూ శాఖ తీసుకునే చర్యలు కూడా ఇందులో ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి. వ్యవస్థలో డిమాండ్‌ ఆందోళనలను తగ్గించేందుకు ప్రభుత్వం, వినియోగదారుల నగదు లభ్యతను పెంచనుంది. అంతేకాకుండా వినియోగాధారిత వస్తువులపై పరోక్ష పన్నులను తగ్గించి వినియోగాన్ని పెంచే చర్యలను చేపట్టనుంది. ‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రవేశపెట్టడం చాలా అవసరం. మేం రూ .1 లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని సూచీంచాం’ అని అసోచాం అధ్యక్షుడు, బీకే గొయాంక్‌ అన్నారు.
   ఆటో రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే ఆర్థిక మంత్రి  సూచనలిచ్చారు. కాగా ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీ రేట్లను తగ్గించడం, కొత్త కొనుగోళ్లను ప్రోత్సహించే స్క్రాపేజ్ పాలసీ వంటి విధానాలను ప్రవేశపెట్టాలంటూ పరిశ్రమ వర్గాలు కోరిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆటో సెక్టార్‌ మందగమనాన్ని అధిగమించాలని ఈ పరిశ్రమ ఆశపడుతోంది. ఆటో ఫైనాన్సింగ్‌ను అం‍దించే కొన్ని పెద్ద ఎన్‌బీఎఫ్‌సీల పతనం వలన కూడా ఆటో అమ్మకాలు భారీగా పడిపోయాయి. ‘ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు,  పరిశ్రమలను తిరిగి వృద్ధి మార్గంలోకి తీసుకురావడానికి,  పునరుద్ధరణ ప్యాకేజీతో ప్రభుత్వం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ అన్నారు.
   అయితే ఆర్థిక సంవత్సరం 2019 లో ఆర్థిక లోటు 3.4 శాతంగా ఉ‍ంది. ఇది ప్రస్తుతం ప్రభుత్వం అందించనున్న ఉద్ధిపన ప్యాకేజీ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ‘ఇటివల ఆర్థిక మంత్రి వివిధ పరిశ్రమలకు చెందిన విభాగాలతో సమావేశమయ్యారని, వారి ఆలోచనలను, ఆందోళనలను అర్థం చేసుకొని ఒక ప్యాకేజీని సిద్ధంచేస్తారని పరిశీలకులు తెలిపారు. ముఖ్యంగా జూలై 5 న కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన  ఎఫ్‌పీఐలపై పన్ను సర్‌చార్జిని, ఈ ఉద్దీపన ప్యాకేజీ కవర్ చేసే అవకాశం ఉంది. దీనితో పాటు దీర్ఘకాలిక మూలధన లాభ పన్ను (ఎల్‌టీసీజీ) ను తిరిగి పరిశీలించే అవకాశం ఉంది. మూడేళ్ల పాటు హోల్డింగ్‌ ఉన్న ఈక్విటీలపై ఎల్‌టీసీజీని ఉపసంహరించుకునే అవకాశాన్ని ఆర్థిక మంత్రి అన్వేషిస్తున్నారని, అంతేకాకుండా డివిడెండ్ పంపిణీపై పన్ను వంటి మార్కెట్ లావాదేవీలపై ఇతర పన్నులను కూడా పునర్‌ పరిశీలించవచ్చని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన షేర్‌ బైబ్యాక్‌లపై విధించిన పన్నును కూడా తిరిగి పరిశీలించవచ్చు. ‘ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలో చిక్కుకోకుండా ఉండేందుకు ఆర్థిక మంత్రి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆటో సెక్టార్లో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ సంక్షోభం, ​ఇతర సెక్టార్‌లకు వ్యాపించకుండ ఉండేందుకు ప్రస్తుతం బలమైన ఉద్దీపనం అవసరం’ అని పరిశీలకులు అంటున్నారు.You may be interested

గరిష్టస్థాయిల వద్ద పసిడిలో లాభాల స్వీకరణ

Wednesday 14th August 2019

కిత్రం ట్రేడింగ్‌ సెషన్‌లో గరిష్టస్థాయిని అందుకున్న పసిడి ఫ్యూచర్లో లాభాల స్వీకరణ చేటుచేసుకుంది. హాంగ్‌కాంగ్‌ ఉద్రికత్తలు, అర్జెంటీనా రాజకీయ సంక్షోభం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం తదితర కారణాలో నిన్నటి ట్రేడింగ్‌లో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1,546 డాలర్ల వద్ద గరిష్టస్థాయిని తాకింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్‌లు చైనా వైస్ ప్రీమియర్ లియు హితో వాణిజ్య చర్చలు జరిపినట్లు ప్రకటించారు.

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 14th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఫ్యూచర్‌ రీటైల్‌:- అమెజాన్‌ సంస్థ 8నుంచి 10శాతం వాటాను కొనుగోలుకు చర్చలు జరుపుతోంది.  ఎంఅండ్‌ఎం:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ధీర్ఘకాలిక ఇష్యూయర్‌/ఇన్‌స్ట్రూమెంట్‌ రేటింగ్‌ను ఇండియా ఎఎఎగానూ,  అవుట్‌లుక్‌ స్థిరత్వంగానూ కేటాయించింది.  ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- గాయత్రి ప్రాజెక్ట్‌ కన్షారియం జాయింట్‌ వెంచర్‌తో కలిసి నాగాలాండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ సంబంధించి రూ.914.3కోట్ల విలువైన ఆవార్డును దక్కించుకున్నట్లు ప్రకటించింది. విప్రో లిమిటెడ్‌:- ఇంటెల్ ఆధారిత ఎడ్జ్ ఆర్టిఫిషియల్

Most from this category