News


ప్యాకేజీ సోమవారం వరకూ లేనట్టే!

Saturday 17th August 2019
news_main1566020658.png-27831

ఆర్థిక ఉద్ధీపన ప్యాకేజీపై చర్చించడానికి వివిధ శాఖలతో మరిన్ని సమావేశాలను ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుండడంతో, సోమవారంలోపు ఎటువంటి ప్యాకేజి వెలువడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సంబం‍ధిత అధికారులతో గురువారం చర్చించిన విషయం తెలిసిందే. విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)ను అధిక పన్ను నుంచి మినహాయించడం, లిస్టెడ్ కంపెనీల్లో కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచే ప్రతిపాదనను వాయిదా వేయడం, బ్యాంకింగ్‌ రుణాలను సరళతరం చేయడం వంటి విధానపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. వినియోగదారుల డిమాండ్, ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగేందుకు పన్ను మినహాయింపులతో సహా ఉద్దీపన చర్యలను కోరిన పరిశ్రమల వర్గాలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు సమావేశాలు నిర్వహించారు. కాగా భారత ఆర్థిక వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ (ఏఎన్‌జెడ్‌) తగ్గించిన విషయం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులలో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చడం కష్టమని ఈ బ్యాంక్‌ తెలిపింది.



You may be interested

స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 17th August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా లాభపడింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ముగిసే సరికి 11,069.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11064.65 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్‌:- జర్మన్‌ ఆర్థిక ఉద్దీపన చర్యలు వార్తలతో పాటు

నిఫ్టీ 11350 స్థాయిని అందుకునే అవకాశం

Saturday 17th August 2019

‘మార్కెట్లు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్‌లను కొనసాగించడానికి, కొత్తగా లాంగ్‌ పొజిషన్‌లను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు’ అని సామ్కో సెక్యురిటీష్‌, రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అన్నారు. ఈ వారం మొత్తంగా గమనిస్తే మార్కెట్‌లు నెగిటివ్‌లో ముగిశాయని, షార్ట్‌ కవరింగ్‌ జరిగితే నిఫ్టీ తిరిగి 11,350 స్థాయిని అందుకోగలదని తెలిపారు. ‘అంతర్జాతీయంగా ఎటువంటి నెగిటివ్‌ సంకేతాలు లేకపోతే అగష్టులో 10,780 ఒక మంచి మద్ధతు స్థాయి కాగలదు’ అని

Most from this category