‘సూపర్ రిచ్’ ట్యాక్స్ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపు?
By Sakshi

ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అధిక సంపన్నులపై సూపర్ రిచ్ ట్యాక్స్‌ను విధించడంతో దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో విదేశి నిధుల ఔట్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ విదేశి నిధుల ఔట్ ఫ్లో ను తగ్గించడానికి చర్యలను చేపట్టనుంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్టీసీజీ) విధించే ట్యాక్స్ ను తొలగించడం, డివిడెండ్ డిస్ట్రీబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను సులభతరం చేయడం వంటి మార్కెట్ ప్రెండ్లీ నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని ఓ ఆంగ్ల చానెల్ గురువారం ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. అయితే ఎఫ్‌పీఐలు మినహా అత్యంత ధనికులపై సర్‌చార్జి అలానే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ‘ప్రభుత్వం, నోటిఫికేషన్ లేదా ఆర్డినెన్స్ ద్వారా ఎఫ్‌పీఐలను అధిక సర్‌చార్జి నుంచి ఉపసంహరించుకోవచ్చు’ అని ఆ వార్త చానెల్ నివేదించింది. ఒకవేళ ప్రభుత్వం, ఆర్డినెన్స్ ద్వారా ఈ పక్రియ కొనసాగించాలనుకుంటే తదుపరి సెషన్లలో పార్లమెంట్ ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయంతో సమావేశమయ్యాక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆంగ్ల వార్త చానెల్ నివేదికలో పేర్కోంది.
‘ఎఫ్‌పీఐలను అధిక సర్‌చార్జి నుంచి మినహాయింపు ఇవ్వడం వలన రూ.400 కోట్లు ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వం కోల్పోతుంది’ అని నివేదిక తెలిపింది. ఈ ప్రతిపాదనను న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత ఎఫ్‌పిఐలపై నిర్ణయం తీసుకుంటామని సంబంధిత వర్గాలు ఆంగ్ల వార్త చానెల్‌కు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమర్పించిన బడ్జెట్లో సూపర్ రిచ్ పై సర్‌చార్జి పెంచాలని ప్రభుత్వం ఇంతకుముందు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ సర్‌చార్జ్, ఎఫ్‌పిఐలపై అదనపు పన్ను భారాన్ని పెంచింది. ఇండియాలో ఎఫ్‌పీఐల నిర్వహణ చాలావరకు కార్పొరేట్యేతర సంస్థలైన ట్రస్ట్‌లు, అసోసియేషన్ వంటి మార్గాల ద్వారా జరుగుతోంది. ఫలితంగా ఈ పన్నుల భారం ఎఫ్‌పీఐలపై కూడా పడింది. సూపర్ రిచ్ ట్యాక్స్‌ను విధించిన తర్వాత నుంచి ఈక్విటీ సూచీలు తీవ్రమైన అమ్మకపు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ బడ్జెట్ రోజున రూ .151.35 లక్షల కోట్లుగా ఉండగా, ఆగస్టు 7 వ తేది నాటికి అది రూ .138.82 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగా రూ .12.53 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ఈక్విటీ మార్కెట్లలో జరిగిన అమ్మకాలకు, అధిక భాగం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులే (ఎఫ్ఐఐ) కారణమని చెప్పవచ్చు. జూలై 1 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంఎస్ఈఐలలో, క్యాపిటల్ మార్కెట్ విభాగంలో రూ .20,000 కోట్లకు పైగా విలువైన స్టాక్లను ఎఫ్‌పీఐలు విక్రయించినట్లు పీటీఐ తెలిపింది.
తాజాగా ఈవార్త వెలువడిన తర్వాత మార్కెట్లలో ర్యాలీ జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్‌లో 636.86 పాయింట్లకు పైగా ర్యాలీ చేసి 37,327.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 176.95 పాయింట్లు లాభపడి 11,032.45 పాయింట్ల వద్ద ముగిశాయి.
You may be interested
11000 పైన ముగిసిన నిఫ్టీ
Thursday 8th August 2019మిడ్‌సెషన్ నుంచి మొదలైన కొనుగోళ్లతో గురువారం మార్కెట్ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 636 పాయింట్లు లాభపడి 37,327.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 11,032.45 ముగిసింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు కాస్త మెరుగుపడటంతో పాటు కనిష్టస్థాయిల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరించింది. అలాగే బడ్జెట్లో ప్రతిపాదించిన సంపన్న వర్గాలపై పన్ను విధింపును ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు
బంగారంలో బుల్‌రన్!
Thursday 8th August 20192013 గరిష్ఠాలను దాటే ఛాన్స్ దేశీయంగా రూ.40వేలకు అవకాశం కమోడిటీల్లో బంగారం నూతన బుల్ సైకిల్‌లోకి ప్రవేశించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆరేళ్ల తర్వాత పసిడి 1400 డాలర్లపైకి చేరింది. ఈ స్థాయికి పైన 1450, 1475, 1500, 1520 డాలర్ల వరకు క్రమానుగత ర్యాలీకి ఛాన్సులున్నాయి. సుదీర్ఘ కన్సాలిడేషన్ తర్వాత బంగారంలో బుల్స్ పరుగులు ఆరంభమయ్యాయని, ఇవి ఇప్పట్లో ఆగవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి కీలక బ్రేకవుట్ సాధించిందని,