News


పావు శాతం ఫెడ్‌ రేట్ల కోత

Thursday 19th September 2019
news_main1568863224.png-28413

వాషింగ్టన్‌: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పావు శాతం(25 బేసిస్‌ పాయింట్లు) మేర తగ్గించింది. ఫెడ్‌ ఫండ్స్‌ రేటును ఇప్పుడున్న 2-2.5% శ్రేణి నుం‍చి 1.75-2 శాతం శ్రేణికి తగ్గించింది. ఫెడ్‌ రేట్లను తగ్గించడం ఈ ఏడాది రెండో సారి. మరోపక్క జీడీపీ అంచనాలను 2.2 శాతానికి ఫెడ్‌ పెంచింది.  ఈ ఏడాది మరోసారి, లేదా రెండు సార్లు రేట్ల కోత ఉండాలని ఫెడ్‌ అధికారుల్లో ఐదుగురు సూచించారు. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి ఈ మేర రేట్లను ఫెడ్‌ తగ్గించింది. గత శనివారం సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడులు రేట్ల కోతకు ​‍ఉత్ప్రేరకంగా పనిచేశాయని నిపుణులంటున్నారు. రేట్ల కోత కారణంగా భారత్‌ వంటి వర్థమాన దేశాలకు ప్రయోజనం కలుగుతుంది. వర్థమాన దేశాల స్టాక్‌, డెట్‌ మార్కెట్లలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయి. 



You may be interested

బ్యాంకు మోసాలపై సీవీసీ సలహాబోర్డు ఏర్పాటు

Thursday 19th September 2019

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైన మోసాల కేసులను పరిశీలించి చర్యలను సూచించేందుకు గాను మాజీ సీవీసీ టీఎం భాసిన్‌ అధ్యక్షతన ఓ సలహా మండలి (అడ్వైజరీ బోర్డు)ని ఏర్పాటు చేస్తూ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో నిజాయితీ నిర్ణయాల విషయంలో బ్యాంకులకు విచారణ వేధింపుల నుంచి రక్షణకు ఉంటుంది. నిజాయితీ నిర్ణయాలకు రక్షణ ఉండాలన్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌

నిఫ్టీ పుల్‌బ్యాక్‌ ర్యాలీ.. అయినా పరిమితమే..

Thursday 19th September 2019

నిఫ్టీ గురువారం పెరిగినా కానీ, పుల్‌బ్యాక్‌ పరిమితమేనంటున్నారు ప్రముఖ నిపుణులు, జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్ మిలాన్‌ వైష్ణవ్‌. మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది..   ‘‘బుధవారం సెషన్‌ స్తబ్దుగా ఉంది. నిఫ్టీ రెండు రోజుల నష్టం తర్వాత 23.05 పాయింట్ల లాభంతో, కీలకమైన మద్దతు స్థాయి పైన నిలిచింది. గురువారం వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉంది. కనుక నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయి 10,780-10,800ని

Most from this category