STOCKS

News


కేంద్ర బడ్జెట్‌పై ‘తెలుగు పలుకులు’

Sunday 2nd February 2020
news_main1580625648.png-31442

  • కేంద్ర ఆర్థిక బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వెల్లడించిన తెలుగు ప్రజలు
  • ఉద్యోగులకు ఊరటనిచ్చినా.. 2 రకాల పన్నుల విధానం గందరగోళంగా ఉందని వ్యాఖ్యలు
  • రియల్టీ రంగంపై పట్టించుకోలేదని, గృహ రుణాలకు రాయితీలు లేవని అసంతృప్తి


సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మహారాష్ట్రలో ఉంటున్న తెలుగు ప్రజల్లో భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. అందరికీ ప్రాధాన్యం లభించిందని కొందరు పేర్కొంటుండగా మరోవైపు ఎల్‌ఐసీ వాటాలను విక్రయించేందుకు సిద్దమవడంతోపాటు అటోమొబైల్, టెలికాం రంగాల గురించి ప్రస్తావన లేకపోవడం తదితరాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలా ‘బడ్జెట్‌’ పై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై తెలుగు ప్రజల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

నిరాశపరిచిన బడ్జెట్‌...
గత సంవత్సరం ప్రకటించిన బడ్జెట్‌తో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌ నిరాశపరిచింది. వ్యక్తిగత పన్నులలో మినహాయింపు ఇస్తున్నట్టు చూపెట్టారు. కానీ, అనేక రాయితీలను తొలగించారు. సింప్లిసిటీ పేరుతో రెండు రకాల పన్ను పద్దతులను ప్రవేశపెట్టడం ప్రజలను ఆయోమయానికి గురిచేసేలా ఉంది. మరోవైపు రియల్టీ సెక్టార్‌ గురించి ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం రియల్టీ రంగం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న బిల్డర్లు, డెవలపర్లకు నిరాశే ఎదురైంది. ఈ రంగంలో పెట్టుబడులు, లేదా గృహరుణాలు తీసుకునేవారికి రాయతీలను మినహాయించడం ఈరంగాన్ని మరింత దయనీయ పరిస్థితికి దిగజార్చేలా చేసింది. ఇక ప్రస్తుతం జీడీపీ 5 శాతం ఉండగా ప్రొజెక్షన్‌ 10 శాతం పేర్కొనడం అసాధ్యం.

  •  మాదిరెడ్డి కొండారెడ్డి. (ప్రధాన కార్యదర్శి తెలుగు కళాసమితి, నవీముంబై).

 

అన్ని రంగాలకు అనుకూలం...
 కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగం, చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు, కార్పొరేటర్‌ సెక్టార్, మహిళలు ఇలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు విధించే పన్నులలో నూతన శ్లాబ్‌లు ప్రవేశపెట్టి అందరికీ లాభం చేకూర్చారు.

  • అశోక్‌ రాజ్‌గిరి సీఏ చార్టెడ్‌ అకౌంటెంట్‌ , ముంబై


ఉద్యోగులకు కొంత ఊరట... 
పన్నుల శ్లాబ్‌లలో కొత్త శ్లాబ్‌లు ప్రవేశపెట్టి ఐదు నుంచి 15 శాతం వరకు పన్నులలో రాయితీ కల్పించడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చేలా ఉంది. రూ. 5 లక్షల వరకు ఆదాయం పన్నులో తేడా లేకపోయినప్పటికీ  రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉన్న శ్లాబ్‌లో రూ. 5 లక్షల నుంచి రూ. 7.50 లక్షలు, రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రెండు శ్లాబ్‌లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా శ్లాబ్‌లను మార్చి 5 శాతం నుంచి 15 శాతం వరకు రాయితీ కల్పించడం చాలా ఊరటనిచ్చేలా ఉంది. 

  •    దావనపెల్లి రజనీకాంత్‌ (ఎన్‌పీవీ అండ్‌ అసోసియేట్స్‌ ఉద్యోగి, కాందివలి).


ట్యాక్స్‌ల విధానం అయోమయంగా ఉంది... 
 కేంద్ర బడ్జెట్‌ దాదాపు అన్ని రంగాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ట్యాక్స్‌ విధానంలో రెండు రకాలు చేయడం అనేక మందికి కొంత అయోమయానికి గురిచేసేలా ఉంది. శ్లాబ్‌లలో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం అనేక మందికి పెద్ద ఎత్తున ఊరటనిచ్చింది. అయితే పాత ట్యాక్స్‌ విధానంతోపాటు కొత్త విధానం ఇలా రెండు రకాల అప్షన్‌లతో పన్ను విధానం ప్రవేశపెట్టి కొంత అయోమయానికి గురిచేసింది. అనేక మందికి ఈ రెండింటిలో ఏ విధానం లాభదాయకమన్నది తెలుసుకునేందుకు ట్యాక్స్‌ కన్సల్టంట్‌లను అడగాల్సి రానుంది. 

  • సంగెవేని దీపిక (హెచ్‌ఆర్‌ మెనేజర్‌)

 

ఎల్‌ఐసీ వాటల విక్రయంతో ఇబ్బందే
ఎల్‌ఐసీ వాటలను విక్రయించనున్నట్టు ప్రకటించి ఎల్‌ఐసీని కూడా ప్రైవేటీకీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా ప్రైవేటీకీకరణ చేస్తే రాబోయే రోజుల్లో మాలాంటి ఎల్‌ఐసీ ఎజెంట్లకు ఇబ్బందులు రావచ్చు. అయితే ఈ బడ్జెట్‌లోని ప్రకటనలు పూర్తిగా చూడలేదు. దీంతో అన్ని విషయాలు తెలిస్తే మరింత వివరాలు తెలుస్తాయి. 

  •        బూర భాస్కర్, ఎల్‌ఐసీ ఎజెంట్, భివండీ. 



You may be interested

‘పల్లె’కు ఓకే..!

Sunday 2nd February 2020

ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు ఈసారీ నిధుల జోరు.. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గ్రామాలపై దృష్టి... ఇళ్లు, రోడ్ల నిర్మాణానికి కేటాయింపుల జోరు... 2021 మార్చినాటికి మరో లక్ష పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ ఆర్థిక మందగమనం ప్రభావం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్‌లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. అయితే, గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ

ఈయూను వీడిన బ్రిటన్‌

Sunday 2nd February 2020

శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన బ్రెగ్జిట్‌ దేశ చరిత్రలో కొత్త శకమన్న ప్రధాని జాన్సన్‌ ప్రజలు, మీడియాలో మిశ్రమ స్పందనలు లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో బ్రిటన్‌ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్‌ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్‌ శుక్రవారం అర్థరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్‌ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా

Most from this category