News


మాంద్యంలోకి వెళ్లిపోయాం

Friday 13th March 2020
news_main1584068238.png-32444

  • భారత్‌ కూడా ఇందులో భాగమే
  • మార్క్‌ మొబియస్‌ అభిప్రాయం

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లడం ఖాయమేనని వర్ధమాన మార్కెట్ల ఫండ్‌ మేనేజర్‌, మార్క్‌ మొబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ మొబియస్‌ అన్నారు. ‘‘మనకు మాంద్యం రాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సాంకేతికంగా చెప్పాలంటే భారత్‌ సహా ప్రపంచంలో అధిక భాగం మాంద్యంలోనే ఉంది. అలా అని మనం చేతులు పైకెత్తేసి ఓటమిపాలైనట్టు కాదు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. సరఫరా వ్యవస్థ ప్రాముఖ్యత, చైనాపై ఏ విధంగా ఆధారపడి ఉన్నామనే దానిపై ప్రజలు మేల్కొంటున్నారు. అడుగు ముందుకు వేసి కొంత మేర ఈ ఔట్‌సోర్స్‌ వ్యాపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు భారత్‌కు ఇది అద్భుతమైన అవకాశం’’ అని మొబియస్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈటీఎఫ్‌ల కారణంగా నేడు అమెరికా మార్కెట్లు ప్రపంచ మార్కెట్లను నడిపిస్తున్నాయని చెప్పారు. దీంతో యూఎస్‌ మార్కెట్లు పడిపోతే.. అమెరికా మార్కెట్లను అనుసరించే అన్ని మార్కెట్లలోనూ భయానక పరిస్థితి నెలకొనడం సహజమేనన్నారు. ఇక మీదట మార్కెట్లు కనిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఎందుకంటే కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అయితే సార్స్‌, ఎంఈఆర్‌ఎస్‌ స్థాయిలో మరణాల శాతం లేకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విధమైన అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడులు అన్నింటినీ కుమ్మరించేయడం కాకుండా, కనీసం 20 శాతం వరకు అయినా ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని సూచించారు. భారత్‌లో తాజా కరెక్షన్‌ నేపథ్యంలో బలమైన బ్యాంకింగ్‌స్టాక్స్‌పై దృష్టి సారిస్తానని మొబియస్‌ చెప్పారు. అలాగే, వినియోగరంగ స్టాక్స్‌, ఇన్‌ఫ్రా స్టాక్స్‌ పట్ల కూడా సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం అంత ప్రయోజనాన్ని ఇవ్వకపోవచ్చని, బదులుగా ప్రజలకు నేరుగా నగదు ప్రయోజనాన్ని అందించడం, పన్నులు తగ్గించడం ద్వారా వినియోగాన్ని పెంచొచ్చని అభిప్రాయపడ్డారు. 



You may be interested

పర్యాటకం ఢమాల్‌..!

Friday 13th March 2020

ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కరోనా ఎఫెక్ట్‌ సాధారణ ప్రజానీకానికి నో ఎంట్రీ బిజినెస్‌ విజిటర్లూ అంతంతే నిరాశపర్చిన వింగ్స్‌ ఇండియా హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రెండేళ్లకోసారి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్‌ ఇండియా సదస్సు, ప్రదర్శనకు కరోనా ఎఫెక్ట్‌ పడింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం గురువారం (మార్చి 12న) ప్రారంభమైన సంగతి తెలిసిందే. విభిన్న విమానాల ప్రదర్శనతో అటు బిజినెస్‌ విజిటర్లనూ, ఇటు సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకునే ఏవియేషన్‌ షో

రూపాయి.. చరిత్రాత్మక కనిష్టం

Friday 13th March 2020

82 పైసల నష్టంతో ఇంట్రాడేలో 74.50  అటుపై రికవరీ... 74.24 వద్ద ముగింపు  క్రితం ముగింపుతో పోల్చితే 56 పైసలు నష్టం  ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి కొనసాగుతోంది. గురువారం ఒకేరోజు 56 పైసలు పతనమయ్యింది. 74.24 వద్ద ముగిసింది. గడచిన 17 నెలల కనిష్ట స్థాయి ఇది. ఇంకా చెప్పాలంటే, రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టం ముగింపునకు (74.39) 15పైసలు దూరంలో ఉంది. నిజానికి గురువారం ట్రేడింగ్‌ ఒకదశలో రూపాయి విలువ

Most from this category